Begin typing your search above and press return to search.

నైజాంలో 'పెద్ది' మ్యానియా.. తారక్, బన్నీ, పవన్ సినిమాలకు షాక్!

అయితే మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం పెద్ది సినిమాకు కలిసి వస్తోందని టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   7 Jun 2026 11:47 AM IST
నైజాంలో పెద్ది మ్యానియా.. తారక్, బన్నీ, పవన్ సినిమాలకు షాక్!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఆ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా, ముఖ్యంగా నైజాం ప్రాంతంలో భారీ వసూళ్లతో సత్తా చాటుతోంది. వరుసగా మూడు రోజుల పాటు స్ట్రాంగ్ కలెక్షన్లు సాధించి, నైజాం ఆల్‌ టైమ్ రికార్డుల లిస్ట్ లో టాప్-5లో చోటు సంపాదించింది.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం, పెద్ది తొలి రోజు నైజాంలో రూ.18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. రెండో రోజు కూడా సాలిడ్ వసూళ్లు రాబట్టిన ఆ చిత్రం, మూడు రోజులు కలిపి సుమారు రూ.34 కోట్ల షేర్ మార్క్‌ ను అందుకుంది. సినిమా విడుదలైన వెంటనే వచ్చిన పాజిటివ్ టాక్, రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు తెరకెక్కించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మూడు రోజుల వసూళ్లు ఆధారంగా చూస్తే, నైజాంలో అత్యధిక షేర్ సాధించిన చిత్రాల జాబితాలో పెద్ది ఐదో ప్లేస్ లో నిలిచింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర, పవన్ కళ్యాణ్ ఓజీ, అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సహా పలు చిత్రాల రికార్డులు బ్రేక్ అయ్యాయి. ప్రస్తుతం నైజాం ప్రాంతంలో తొలి మూడు రోజుల షేర్ వసూళ్ల జాబితాలో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత పుష్ప 2, కల్కి 2898 ఏడీ, సలార్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ది కూడా ఆ లిస్ట్ లో చేరడం విశేషం.

ఆర్ఆర్ఆర్- రూ.51.20 కోట్లు

పుష్ప 2: ది రూల్- రూ.48.50 కోట్లు

కల్కి 2898 ఏడీ- రూ.41.60 కోట్లు

సలార్ పార్ట్ 1- రూ.38.50 కోట్లు

పెద్ది- రూ.34 కోట్లు

దేవర- రూ.31.20 కోట్లు

అయితే మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం పెద్ది సినిమాకు కలిసి వస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక నాలుగో రోజు ఆదివారం కావడంతో థియేటర్ల వద్ద ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీకెండ్ ముగిసే సరికి సినిమా మరిన్ని రికార్డులు అందుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇక పెద్ది చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటించగా, కన్నడ నటుడు రాజ్‌ కుమార్ కీలక పాత్ర పోషించారు. అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఆ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ కు ఎమోషన్స్ ను మిక్స్ చేస్తూ రూపొందిన ఆ సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.