పెద్ది బాక్సాఫీస్ ర్యాంపేజ్.. నైజాం కూడా తోడైతే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
By: M Prashanth | 2 Jun 2026 3:52 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ఇప్పటికే వార్తలు రాగా.. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బుకింగ్స్ ఓపెన్ కావడంతో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణలోని నైజాం ఏరియాలో బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాకపోయినా, మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న బుకింగ్స్ ట్రెండ్ సినిమాపై ఉన్న అంచనాలను క్లియర్ గా చూపిస్తోంది. నేషనల్ వైడ్ గా ప్రీమియర్స్, తొలి రోజు షోల కోసం జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ కలిపి రూ.12 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఓవర్సీస్ లో కూడా పెద్ది జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా సహా పలు దేశాల మార్కెట్లలో ప్రీసేల్స్ స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు రూ.12 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఇండియా, ఓవర్సీస్ బుకింగ్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా సినిమా అడ్వాన్స్ సేల్స్ రూ.24 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక నైజాం బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. థియేటర్ రెంటల్స్, రెవెన్యూ షేరింగ్ అంశాలకు సంబంధించిన చర్చలు, అలాగే ప్రత్యేక షోలు, టికెట్ ధరల అనుమతుల విషయంలో ఆలస్యం కారణంగా బుకింగ్స్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అయితే నైజాం బుకింగ్స్ కూడా ప్రారంభమై ఉంటే అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇప్పటికే రూ.30 కోట్ల మార్క్ కు చేరుకునే అవకాశం ఉండేదని అంతా భావిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాల సందడి తక్కువగా ఉన్న సమయంలో పెద్దిపై అందరి ఫోకస్ పడింది. సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు మరింత భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే పెద్ది చిత్రం రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ కు సిద్ధమవుతున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ యాక్టర్ జగపతిబాబు, బాలీవుడ్ స్టార్ దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ నిర్మించిన ఆ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పించిన ఆ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఎడిటర్ గా నవీన్ నూలి వర్క్ చేశారు. రూ.300 కోట్లకుపైగా బడ్జెట్ తో సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా విడుదలకు ముందే బుకింగ్స్ పరంగా దూసుకెళ్తున్న పెద్ది మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అంతా వేచి చూడాలి.
