Begin typing your search above and press return to search.

ఊక వేస్తే రాలనంత మంది.. 'పెద్ది' భోపాల్ ఈవెంట్ క్రేజ్!

కానీ ఇప్పుడు ఏకంగా ఉత్తరాది రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో జరిగిన 'పెద్ది' సినిమా మెగా ఈవెంట్ చూశాక.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ అర్థమవుతోంది.

By:  Sivaji Kontham   |   24 May 2026 12:02 AM IST
ఊక వేస్తే రాలనంత మంది.. పెద్ది భోపాల్ ఈవెంట్ క్రేజ్!
X

హైదరాబాద్ లేదా దక్షిణాది నగరాల్లో ఒక మెగా ఈవెంట్ జరిగితే అభిమానుల రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏకంగా ఉత్తరాది రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో జరిగిన `పెద్ది` సినిమా మెగా ఈవెంట్ చూశాక.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ అర్థమవుతోంది. భోపాల్ వేదికగా ఒక భారీ ఓపెన్-ఎయిర్ సెలబ్రేషన్‌గా ప్లాన్ చేసిన `పెద్ది కి ఆవాజ్` కార్యక్రమానికి ఊక వేస్తే రాలనంత జనసందోహం తరలివచ్చింది. కేవలం రామ్ చరణ్ క్రేజ్‌ను మాత్రమే కాకుండా.. సినిమా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై మధ్యప్రదేశ్ ప్రజలకు ఉన్న విపరీతమైన ఆసక్తిని కూడా ఈ వేడుక‌ స్పష్టంగా నిరూపించింది.








ఈ గ్రాండ్ భోపాల్ ఈవెంట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే వేదిక పరిసరాలన్నీ వేలాది మంది అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పాసులు, టికెట్లు ముందే పూర్తిగా సోల్డ్ అవుట్ అవ్వడం రామ్ చరణ్ పాన్-ఇండియా స్టార్‌డమ్‌కు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. వేదికపై రామ్ చరణ్‌ను.. అలాగే ఈ సినిమా కోసం ఆయన డిజైన్ చేసుకున్న సరికొత్త `పెద్ది` లుక్‌ను చూసి ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇటు నార్త్ ఆడియన్స్‌ను కూడా ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో ఈ వేడుక సాక్షిగా అర్థం చేసుకోవ‌చ్చు.





ప్రమోషన్ల పరంగా ఇటీవలి కాలంలోనే అత్యంత భారీ ఈవెంట్‌గా నిలిచిన ఈ వేడుకలో `పెద్ది` చిత్రబృందం మొత్తం పాల్గొని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది. ఇక రెహ‌మ‌న్ లైవ్ షో గురించి ముందే తెలియ‌డంతో బోపాల్ యూత్ మొత్తం ఈ వేదిక వ‌ద్ద ఎగ‌బ‌డ్డారు.





ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నార్త్ మార్కెట్‌ను ఏ విధంగా శాసించబోతున్నాడో ఈ జంట ఫ్యాన్ బేస్ చూస్తేనే అర్థమవుతోంది. సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ప్లాన్ చేసిన ఈ భోపాల్ ఈవెంట్ స్ట్రాట‌జీ వందకు వంద శాతం సక్సెస్ అయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.





సౌత్ సినిమాలకు నార్త్ బెల్ట్‌లో లభిస్తున్న ఆదరణకు ఈ భోపాల్ ఈవెంట్ ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. దేశంలోని నలుమూలలా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఉన్న తిరుగులేని క్రేజ్ ఉంద‌ని ప్రూవ్ అయింది. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చాక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.