పెద్ది: చరణ్ మాస్ ర్యాంపేజ్!
ఈ హై ఓక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రముఖ స్టంట్ డైరెక్టర్ నబాకాంత్ డిజైన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 22 Jun 2025 6:53 AMగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా పెద్ది షూటింగ్ భారీ హైప్‌తో సాగుతోంది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే గ్రామీణ నేపథ్యంలోని ఎమోషనల్ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేసిన చిత్రబృందం.. తాజాగా ఓ భారీ యాక్షన్ సీన్‌ను తెరకెక్కిస్తోంది. నైట్ షెడ్యూల్‌లో జరుగుతున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందంటున్నారు మేకర్స్. చరణ్ కెరీర్‌లోనే ఇది టఫ్ అండ్ ఇంటెన్స్ సీన్ అవుతుందన్న టాక్ స్పష్టంగా వినిపిస్తోంది.
ఈ హై ఓక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రముఖ స్టంట్ డైరెక్టర్ నబాకాంత్ డిజైన్ చేస్తున్నారు. ఈ సీన్‌కు సంబంధించిన షూట్ గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “గత రాత్రి గొప్ప విజువల్స్‌తో కూడిన యాక్షన్ సీన్ షూట్ చేశాం. చరణ్ రెచ్చిపోయాడు… మండిపోయాడు” అంటూ పొగడ్తలతో ట్వీట్ చేశారు. రత్నవేలు కామెంట్స్ తో సినిమాపై కొత్తగా బజ్ క్రియేట్ అయింది.
ఇతర సమాచారం ప్రకారం, ఈ యాక్షన్ సీన్ కోసం భారీ బడ్జెట్‌తో గ్రాండ్ సెట్ వేసి, నైట్ టైంలో స్పెషల్ లైటింగ్‌తో సినిమా స్టైల్‌కి తగ్గ అద్భుత విజువల్స్ ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ కథకు కీలక మలుపు కావడంతో టెక్నికల్ టీమ్ పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయిందట. ఇదంతా చూస్తే పెద్దిలో యాక్షన్ కూడా ఓ హైలైట్ అవుతుందని స్పష్టమవుతోంది.
చరణ్ క్యారెక్టర్ ఎంతో స్ట్రాంగ్‌గా డిజైన్ చేసినట్టు సమాచారం. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, మాస్ యాటిట్యూడ్‌తో ఈ సీన్‌లో చరణ్ తన బెస్ట్‌ని ఇచ్చాడని యూనిట్ చెబుతోంది. విజువల్ ట్రీట్ ఇస్తూ మాస్‌ను మంత్ర ముగ్దులను చేసేలా ఈ ఎపిసోడ్ ఉంటుందట. బుచ్చిబాబు ఎమోషనల్ స్టోరితోడు మాస్ యాక్షన్‌ను బలంగా మిక్స్ చేస్తున్నారని టాక్. ఇక 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. బిగ్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. చరణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ అయే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.