పెద్ది స్పెషల్ సాంగ్.. మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్..!
ఓకే కానీ పూజా హెగ్దేతో చేసిన ఆచార్య ఫ్లాప్ అయ్యింది కాబట్టి పూజా హెగ్దే వద్దు మరో హీరోయిన్ అయితే బెటర్ అని అంటున్నారు.
By: Tupaki Desk | 12 July 2025 10:15 AM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా భారీ ఎత్తున వస్తుంది. బుచ్చి బాబు ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పెద్ది కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. సినిమాలో చరణ్ ఆట కూలీగా కనిపిస్తాడని తెలుస్తుంది. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ సినిమాలో కీలక రోల్ చేస్తున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ మరో హైలెట్ కానుంది. ఐతే పెద్ది సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.
గురువు సుకుమార్ శిష్యుడిగా కమర్షియల్ సినిమాల్లో ప్రత్యేక గీతం కంపల్సరీ అన్న సూత్రాన్ని నమ్ముతున్నాడు బుచ్చి బాబు. అందుకే పెద్ది సినిమాలో కూడా ఒక క్రేజీ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ లో ఎవరిని పెట్టాలా అన్న ఆలోచనలో ఉన్నారట. ఐతే రంగస్థలం సినిమాలో పూజా హెగ్దే చేసిన జిగేలు రాణి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అందుకే పెద్దిలో పూజా హెగ్దేని ఆ సాంగ్ కి ఒప్పించాలని చూస్తున్నారు.
ఐతే మెగా ఫ్యాన్స్ మాత్రం రంగస్థలం సెంటిమెంట్ ఓకే కానీ పూజా హెగ్దేతో చేసిన ఆచార్య ఫ్లాప్ అయ్యింది కాబట్టి పూజా హెగ్దే వద్దు మరో హీరోయిన్ అయితే బెటర్ అని అంటున్నారు. పూజా హెగ్దే ఈమధ్య తెలుగు సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. తెలుగులో అసలు ఆమెను పట్టించుకునే వాళ్లే లేరన్నట్టుగా ఉంది.
టాలీవుడ్ దూరం పెట్టడంతో తమిళ పరిశ్రమకు పూజా బెస్ట్ ఆప్షన్ అయ్యింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది అమ్మడు. ఐతే పెద్దిలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ ఉంటే పూజా బేబ్ కి ఇది మంచి కంబ్యాక్ అవుతుంది. ఒకవేళ ఫ్యాన్స్ మాటలను సీరియస్ గా తీసుకుంటే మాత్రం ఆ ఛాన్స్ కూడా లేనట్టే.
పెద్ది సినిమా 2026 మార్చి ఎండింగ్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అనుకున్న డేట్ కి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి పెద్ది అనుకున్న విధంగా నెక్స్ట్ ఇయర్ మార్చి రిలీజ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. సినిమా అయితే వాయిదా పడే అవకాశం లేదన్నట్టు ఉంది. ఒకవేళ రిలీజ్ దగ్గర పడుతున్న టైం లో ఏదైనా మార్పులు ఉంటే చెప్పలేం. ఐతే 2026 మార్చి ఎండింగ్ కే నాని ప్యారడైజ్ సినిమా కూడా వస్తుంది.
