చరణ్-సుకుమార్ మధ్యలో నికిల్ నాగేష్ భట్!
అనంతరం ఆర్సీ 17 సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఆ రకంగా సినిమా పట్టాలెక్కుతుందని ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 9 April 2025 10:30 PMమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్సీ 16 బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుంది. అప్పటివరకూ చరణ్ అభిమానులు రిలీజ్ కోసం ఎదురు చూడాల్సిందే. అనంతరం ఆర్సీ 17 సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఆ రకంగా సినిమా పట్టాలెక్కుతుందని ఎదురు చూస్తున్నారు.
కానీ అది జరిగేలా లేదు. బుచ్చిబాబు-సుకుమార్ మధ్యలోకి మరో బాలీవుడ్ డైరెక్టర్ వస్తున్నాడు. చరణ్ 17వ చిత్రం సుకుమార్ ది కాదని ఓ కొత్త దర్శకుడిది అవుతుందని మెగా కాంపౌండ్ వర్గాల నుంచే వినిపిస్తోన్న కొత్త మాట. `కిల్` సినిమాతో బాలీవుడ్ కి సంచలన విజయం అందించిన నిఖిల్ నాగేష భట్ తో రామ్ చరణ్ 17వ సినిమా పట్టాలెక్కుతుందని తాజాగా అందుతోన్న సమాచారం.
ఇప్పటికే నిఖిల్ చరణ్ కి స్టోరీ వినిపించాడని..ఓ డిఫరెంట్ స్టోరీ కావడంతో చరణ్ కూడా ఒకే చెప్పినట్లు లీకులందుతున్నాయి. ఇదే 17వ సినిమాగా మొదలవుతుందని అంటున్నారు. మరి అదే జరిగితే సుకుమార్ పరిస్థితి ఏంటి? అంటే సుకుమార్ కి ఈ విషయం ముందుగానే రామ్ చరణ్ చెప్పాడుట. సుకుమార్ స్టోరీ చెప్పడానికి వెళ్లిన సమయంలో తనకంటే ముందుగానే నాగేష్ స్టోరీ వినిపించినట్లు చెప్పాడుట.
అయితే అప్పటికి నాగేశ్ విషయంలో చరణ్ పూర్తి క్లారిటీతో లేకపోవడం...సుకుమార్ కొత్త స్టోరీ విని పించడం వెంట వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండానే జరిగిందిట. దీంతో సుకుమార్ ప్రాజెక్ట్ ని ప్రకటిం చినట్లు చెబుతున్నారు. కానీ ఇటీవలే నాగేశ్ భట్ మళ్లీ రామ్ చరణ్ ని కలిసి ఫైనల్ వెర్షన్ వినిపించాడుట. స్టోరీ అద్భుతంగా పాన్ వరల్డ్ కి కనెక్ట్ అయ్యేలా ఉండటంతో? ఆర్సీ 17 ఇదే అవ్వాలని భావిస్తున్నాటు.