చెర్రీతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో సాధ్యమేనా?
లెక్కల మాస్టారు సుకుమార్‌తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన `రంగస్థలం` నటుడిగా తనకు ఎంతటి పేరుని తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. `
By: Tupaki Desk | 11 Jun 2025 8:45 AM ISTలెక్కల మాస్టారు సుకుమార్‌తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన `రంగస్థలం` నటుడిగా తనకు ఎంతటి పేరుని తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. `మహానటి`తో కీర్తి సురేష్ పోటీ పడకపోయి ఉంటే ఆ ఏడాది తెలుగుకు ఉత్తమ నటుడిగా చరణ్‌కు జాతీయ పురస్కారం దక్కేదే. అలింటి కాంబినేషన్‌లో మరో సినిమా అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. ఇద్దరి కలయికలో త్వరలో మరో సినిమా ఉంటుందని సుక్కు సైడ్ నుంచి దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది.
అయితే అది ఎప్పుడు మొదలవుతుందనే దానిపై స్పష్టతలేకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టిన చరణ్ దాని స్థానంలో త్రివిక్రమ్‌తో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడని ప్రచారం మొదలైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రచారంలో నిజం లేదని, సుకుమార్, చరణ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది తప్పకుండా మొదలవుతుందని తెలుస్తోంది.
ఇక త్రివిక్రమ్‌తో చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడన్నది నిజమేనని అయితే దీనికి సంబంధించి ఇంత వరకు అధికారిక అప్ డేట్ ని మాత్రం ఇంత వరకు మేకర్స్ రిలీజ్ చేయలేదని ఇన్ సైడ్ టాక్. ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో కలిసి యువ నిర్మాత నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చరణ్ `పెద్ది` షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ దృష్టి అంతా `పెద్ది`పైనే ఉంది.
దీన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుని చరణ్ చేస్తున్నాడు. ఆ కారణం వల్లే మరో ప్రాజెక్ట్ గురించి తను ఆలోచించడం లేదని మెగా వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌తో భారీ పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకురావాలనుకున్న త్రివిక్రమ్ ..ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటంతో దాన్ని ప్రస్తుతం పక్కన పెట్టి దాని స్థానంలో విక్టరీ వెంకటేష్‌తో ఓ ఫ్యామిలీ డ్రామాని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోంది. ఇది పూర్తి చేసిన తరువాతే బన్నీ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాలనుకుంటున్నారట.