Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : చరణ్‌ న్యూ లుక్‌తో కుమ్మేశాడు

టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో కొద్ది మంది మాత్రమే స్టైల్‌ ఐకాన్స్‌గా నిలుస్తూ ఉంటారు. వారిలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఒకరు అనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   31 May 2025 11:31 AM IST
పిక్‌టాక్‌ : చరణ్‌ న్యూ లుక్‌తో కుమ్మేశాడు
X

టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో కొద్ది మంది మాత్రమే స్టైల్‌ ఐకాన్స్‌గా నిలుస్తూ ఉంటారు. వారిలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఒకరు అనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోల్లో రామ్‌ చరణ్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో ఏ పాత్రలో కనిపిస్తే ఆ పాత్రకు తగ్గట్టుగా ఒదిగి పోతారు అనే టాక్‌ ఉంది. అంతే కాకుండా ఆయన లుక్‌ పరంగా ప్రతి పాత్రకు న్యాయం చేస్తారు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో, ఆ తర్వాత నటించిన సినిమాల్లో ఆయన పాత్రలకు ఏ స్థాయిలో ఒదిగి పోయారో మనం చూశాం. చివరగా గేమ్‌ చేంజర్‌లోనూ చరణ్‌ లుక్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఇక సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా చరణ్‌ స్టైలిష్ ఫోటోలు వైరల్‌ అవుతూ ఉంటాయి.

ఆకట్టుకునే విధంగా చరణ్‌ లుక్‌ ఉంటుంది. సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్‌ కొత్త ఫోటోలు ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజగా చరణ్‌ రాయల్‌ లుక్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. పొగవాటి జుట్టు, కాస్త ఎక్కువగా పెరిగిన గడ్డం లుక్‌తో రామ్‌ చరణ్ సర్‌ప్రైజింగ్‌ లుక్‌తో ఆకట్టుకున్నాడు. స్టైలిష్ బ్లేజర్‌ ధరించిన రామ్‌ చరణ్ అంతకు మించి అన్నట్లుగా స్టైలిష్ ఫోజ్ ఇచ్చారు. సైడ్‌ యాంగిల్‌ లుక్‌లో రామ్‌ చరణ్ కుమ్మేశాడు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. రామ్‌ చరణ్ ప్రస్తుతం చేస్తున్న బుచ్చిబాబు మూవీ పెద్ది కోసం జుట్టు, గడ్డం పెంచుతున్న విషయం తెల్సిందే. అందులో భాగంగానే ఇలా స్టైలిష్ లుక్‌తో కనిపించాడు.

రామ్‌ చరణ్‌ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తీసుకున్న ఈ ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌ షేర్‌ చేశారు. రామ్‌ చరణ్‌ ను ఈ రేంజ్‌లో ఏదైనా పూర్తి స్థాయిలో చూడాలని అనుకుంటున్నామని అభిమానులు అంటున్నారు. మరి రామ్‌ చరణ్‌ ఈ స్థాయి స్టైలిష్ లుక్‌లో ముందు ముందు ఏదైనా సినిమాలో నటిస్తాడేమో చూడాలి. రామ్ చరణ్‌ స్టైలిష్ లుక్ ఫోటోలను రెగ్యులర్‌గా అభిమానులు సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి చరణ్‌ న్యూ లుక్‌తో అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకున్నాడు. చరణ్‌ ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీమియర్‌ కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెల్సిందే.

అక్కడ నుంచి వచ్చిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమా షూటింగ్‌ కంటిన్యూ చేస్తున్నాడు. కాస్త ఆలస్యంగా ప్రారంభం అయిన పెద్ది సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మార్చి 27,2026న విడుదల చేయాలని బుచ్చిబాబు టార్గెట్‌గా పెట్టుకున్నాడు. కచ్చితంగా సినిమాను అదే తేదీకి విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇంకా దాదాపుగా సంవత్సర కాలం ఉంది కనుక ఈజీగా షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. రామ్‌ చరణ్‌ బుచ్చిబాబు రేంజ్‌లో పెద్ది సినిమా ఉంటుంది అనే విశ్వాసం ను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. పెద్ది సినిమా తర్వాత చరణ్‌ తదుపరి సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయింది. సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ సినిమా ఉంటుంది. ఇదే ఏడాదిలో ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. రంగస్థలం తర్వాత చరణ్‌, సుకుమార్‌ కాంబోలో మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.