అసలైన ఘట్టంలో పెద్ది.. చరణ్ లుక్స్ వైరల్!
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరగుతోందని సమాచారం. ప్రమోషనల్ కంటెంట్ కు ఇప్పటికే మంచి స్పందన రావడంతో ఆ అంచనాలను నిలబెట్టేలా భారీ స్థాయిలో సినిమా తెరకెక్కుతోంది.
By: Tupaki Desk | 22 May 2025 10:29 AMమెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'పెద్ది'కి ఎనౌన్స్ చేసినప్పుడే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్, జగపతిబాబు లాంటి కీలక తారాగణం ఉండటంతో ఈ సినిమా ఓ స్పెషల్ క్రేజును సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వస్తోన్న ఈ మూవీని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ విలేజ్ సెట్లో కీలక షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ తో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ స్పీడ్ పెరిగింది. లేటెస్ట్ గా ఒక కీలక ఘట్టంలోకి పెద్ది ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాలో ఓ భారీ యాక్షన్ బ్లాక్, టాకీ పార్ట్‌ను లేటెస్ట్ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.
సెట్ డిజైన్ విషయంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బుచిబాబు టీమ్, అత్యంత డిటెయిల్డ్ గా గ్రామీణ వాతావరణాన్ని తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. స్ట్రాంగ్ గా కనిపిస్తున్న చరణ్ లుక్ లాంగ్ హెయిర్, గడ్డం లుక్ వైరల్‌గా మారింది. యాక్షన్ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమాలో చరణ్ పాత్రలో చాలా డెప్త్ ఉంటుందని సమాచారం.
'ఉప్పెన' తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానా చేస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫీని రత్నవేలు అందిస్తున్నారు. అలాగే నేషనల్ అవార్డ్ విజేత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. మరోవైపు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సెట్‌లకు ప్రత్యేక కేరెక్టరే తీసుకొచ్చారు. రామ్ చరణ్ ఓ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా 2026 మార్చి 27న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇదే రోజు చరణ్ పుట్టినరోజు కావడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరగుతోందని సమాచారం. ప్రమోషనల్ కంటెంట్ కు ఇప్పటికే మంచి స్పందన రావడంతో ఆ అంచనాలను నిలబెట్టేలా భారీ స్థాయిలో సినిమా తెరకెక్కుతోంది. 'పెద్ది' సినిమాలో కంటెంట్‌తో పాటు కమర్షియల్ హంగులూ బాగా మిక్స్ చేస్తున్నారని, బుచ్చిబాబు సానా ఈ సినిమా ద్వారా తన స్థాయిని మరింత పెంచనున్నాడని టాక్. భారీ బడ్జెట్ పక్కా కాస్టింగ్ విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న 'పెద్ది' మరోసారి చరణ్ స్టార్ డమ్‌ను రుజువు చేసే సినిమాగా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.