యుద్ధం కారణంగా చరణ్ విగ్రహావిష్కరణకు హైప్ లేదా?
అయితే లండన్ మేడమ్ టుస్సాడ్స్ లో చరణ్ - రైమ్ విగ్రహావిష్కరణ కోసం మెగా కుటుంబం మొత్తం చాలా ముందుగానే లండన్ కి చేరుకున్నారు.
By: Tupaki Desk | 11 May 2025 6:15 AMలండన్ మేడమ్ టుస్సాడ్స్ లో స్టార్ల విగ్రహాలను ఆవిష్కరించి, అక్కడి నుంచి సింగపూర్ కి తరలించడం ఆనవాయితీ. గతంలో సూపర్‌స్టార్ మహేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ల విగ్రహాలను లండన్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించారు. అనంతరం మైనపు విగ్రహాలను సింగపూర్ కి తరలించారు. ఆ సమయంలో మీడియా హైప్, హంగామా మామూలుగా లేదు. అందరి దృష్టి ఈ విగ్రహాలపైనే ఉంది అప్పుడు. డార్లింగ్ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బ్యాంకాక్ లోని మ్యాడమ్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించినప్పుడు హైప్ పరాకాష్ఠకు చేరుకుంది.
కానీ దాంతో పోలిస్తే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ సమయంలో హంగామా అంతగా కనిపించలేదని విశ్లేషిస్తున్నారు. ఓవైపు ముష్కర దేశం పాకిస్తాన్ పై భారత్ యుద్ధం నేపథ్యంలో ప్రజలు, మీడియా దృష్టి పూర్తిగా అటువైపే ఉంది. యుద్ధం ఎంతదాకా వెళుతుందోనన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. దాంతో ఈ మ్యాటర్ కి పెద్దగా హైప్ లేదు. అందరూ యుద్ధానికి సంబంధించిన వార్తలను చూసేందుకు ఎక్కువ ఆసక్తిని కనబరిచారు.
అయితే లండన్ మేడమ్ టుస్సాడ్స్ లో చరణ్ - రైమ్ విగ్రహావిష్కరణ కోసం మెగా కుటుంబం మొత్తం చాలా ముందుగానే లండన్ కి చేరుకున్నారు. అలాగే తన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళుతున్న చరణ్ కి లండన్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమం యుద్ధం భీకరంగా ఉన్న సమయంలో జరిగింది. అందువల్ల మీడియా నుంచి హైప్ అంతగా కనిపించలేదు.
మహేష్, బన్ని, ప్రభాస్ లాంటి స్టార్లకు మైనపు విగ్రహాల్ని ఆవిష్కరించినప్పుడు ఆ వార్త మాత్రమే ప్రధానంగా మీడియాలకు గొప్ప. ఇక వార్ సన్నివేశం కారణంగా చరణ్ కి ఈ హైప్ కొంత తగ్గిందని విశ్లేషిస్తున్నారు. ఎట్టకేలకు లండన్ టుస్సాడ్స్ లో చరణ్ మైనపు విగ్రహం రెడీగా ఉంది. దీంతో రియల్ రామ్ చరణ్ ఫోటోలు దిగారు. చరణ్- రైమ్ జోడీ మైనపు విగ్రహాలు ఈ ఫోటోగ్రాప్ లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మైనపు విగ్రహాలతో రియల్ చరణ్ ఫోజ్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల తర్వాత రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని శాశ్వతంగా మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌కు తరలిస్తారు.