Begin typing your search above and press return to search.

వీడియో: లండ‌న్ వీధుల్లో రౌండ‌ప్ చేసిన మెగాఫ్యాన్స్

మెగాబాస్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ఇద్దరూ అలా లండ‌న్ వీధుల్లో షికార్ వెళ్లిన‌ప్పుడు ఫ్యాన్స్ ఏ రేంజులో వెల్ కం చెప్పారో చూస్తున్నారు క‌దా!

By:  Tupaki Desk   |   10 May 2025 11:39 AM IST
వీడియో: లండ‌న్ వీధుల్లో రౌండ‌ప్ చేసిన మెగాఫ్యాన్స్
X

ప్రతిష్టాత్మక మ్యాడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో చ‌ర‌ణ్‌ మైనపు విగ్రహాన్ని మే 9న ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందే. మ్యాడ‌మ్ టుస్సాడ్స్ లో ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు మెగా కుటుంబం లండన్ కి వెళ్లింది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ తో పాటు పెట్ డాగ్ రైమ్ కూడా లండ‌న్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

చ‌ర‌ణ్ తో పాటు రైమ్ మైన‌పు విగ్ర‌హంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంది. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క మైన‌పు విగ్ర‌హాన్ని త‌దుప‌రి సింగ‌పూర్ టుస్సాడ్స్ కు త‌ర‌లిస్తారు. ఈ స‌మ‌యంలో చ‌ర‌ణ్ బ్రిట‌న్ విజిట్ లో మెగాభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్. మే 11న ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో మెగా కుటుంబం ఆర్.ఆర్.ఆర్ ప్రత్యేక లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనను తిల‌కించ‌నుంది. ఈలోగానే లండ‌న్ వీధుల్లో మెగా సంద‌డి పీక్స్ కు చేరుకుంది.

మెగాబాస్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ఇద్దరూ అలా లండ‌న్ వీధుల్లో షికార్ వెళ్లిన‌ప్పుడు ఫ్యాన్స్ ఏ రేంజులో వెల్ కం చెప్పారో చూస్తున్నారు క‌దా! చ‌ర‌ణ్ బ్లూ సూట్ లో స్టైలిష్ గా క‌నిపించ‌గా, చిరు వైట్ సూట్ లో అల్ట్రా స్టైలిష్ గా క‌నిపిస్తున్న ఈ వీడియో క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ వీడియో మెగా ఫ్యాన్స్ వాట్సాపుల్లోను జోరుగా వైర‌ల్ అవుతోంది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది చిత్రీక‌ర‌ణలో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్ యాత్ర‌ నుంచి తిరిగి రాగానే, తిరిగి చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభిస్తారు.