Begin typing your search above and press return to search.

టాప్ స్టార్స్ అంతా లండ‌న్ వెకేష‌న్ లో!

టాప్ స్టార్స్ అంతా లండ‌న్ వెకేష‌న్ లోనే ఉన్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లండ‌న్ బ‌య‌ల్దేరారు.

By:  Tupaki Desk   |   6 May 2025 7:19 AM
టాప్ స్టార్స్ అంతా లండ‌న్ వెకేష‌న్ లో!
X

టాప్ స్టార్స్ అంతా లండ‌న్ వెకేష‌న్ లోనే ఉన్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లండ‌న్ బ‌య‌ల్దేరారు. `పెద్ది` సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వ‌డంతో చ‌ర‌ణ్ వెంట‌నే లండ‌న్ ప్లైట్ ఎక్కేసారు. కొన్ని రోజుల పాటు వెకేషన్ ముగించుకుని అనంత‌రం అక్క‌డ ఓ భారీ ఈవెంట్ కు హాజ‌ర‌వుతారు. ఇందులో ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన స్క్రీనింగ్ జ‌రుగుతుంది.

ఇదే ఈవెంట్ కోసం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సెలవు కూడా తీసుకున్నారు. ప్ర‌స్తుతం తార‌క్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రాగ‌న్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. `వార్ 2` షూటింగ్ అనంత‌రం `డ్రాగ‌న్` ప‌ట్టా లెక్క‌డంతో నాటి నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే లండ‌న్ స‌మావేశానికి తార‌క్ హాజ‌ర‌వ్వాల్సి ఉండటంతో తాను మాత్ర‌మే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. మిగ‌తా టీమ్ షూటింగ్ నిర్వ‌హిస్తోంది.

ఇదే ఈవెంట్ కు రాజ‌మౌళి కూడా హాజ‌రవుతారు. ఇలా చ‌ర‌ణ్‌..తార‌క్...రాజ‌మౌళి లండ‌న్ లో క‌నిపించ నున్నారు. ఇదే ఈవెంట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా మెరిసే అవ‌కాశం ఉంది. ఆయ‌న కూడా వెకేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ బ్రేక్ ఇవ్వ‌డంతో ఇటీవ‌లే విదేశాల‌కు చెక్కే సారు. అక్కడ నుంచి లండ‌న్ ఈవెంట్ కు చేరుకుంటార‌ని స‌మాచారం.

ఇలా చ‌ర‌ణ్‌, తార‌క్, మ‌హేష్ ఒకేసారి షూటింగ్ లు వ‌దిలేసి లండ‌న్ బాట ప‌డ‌ట్ట‌డం ఇదే తొలిసారి. మును పెన్న‌డు ఇలాంటి స‌న్నివేశం చోటు చేసుకోలేదు. వెకేష‌న్ కి వెళ్లినా ఒక‌రు ఓ దేశంలో..మరొక‌రు మ‌రో దేశంలో ఉండేవారు. లేదంటే హైద‌రాబాద్ లోనే ఉండేవారు. ఎన్న‌డు ముగ్గురు ఒకేసారి ప్లాన్ చేయ‌లేదు. ఈసారి మాత్రం అలా కుదిరింది.