జెట్‌స్పీడ్‌తో రిలీజ్ చేయాలని ప్లాన్!
టాలీవుడ్‌లో మునుపెన్నడూ లేని పరిస్థితి కనిపిస్తోంది. దర్శకులు, హీరోలు ఏళ్లకు ఏళ్లు సినిమాల కోసం వెచ్చిస్తున్నారు.
By: Tupaki Desk | 23 April 2025 7:10 AMటాలీవుడ్‌లో మునుపెన్నడూ లేని పరిస్థితి కనిపిస్తోంది. దర్శకులు, హీరోలు ఏళ్లకు ఏళ్లు సినిమాల కోసం వెచ్చిస్తున్నారు. ఫలితం తారుమారైతే మళ్లీ ట్రాక్‌లోకి రావడం ఎలా, వెంటనే హిట్‌ని దక్కించుకుని మళ్లీ ట్రాక్‌లోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరహాలో మెగా పవర్ స్టార్ టర్న్‌డ్ గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ ఆలోచిస్తున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన RRRతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న రామ్‌చరణ్ మళ్లీ అదే స్థాయి హిట్ కోసం శంకర్‌తో చేతులు కలపడం తెలిసిందే.
ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `గేమ్ ఛేంజర్` బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచి చరణ్‌తో పాటు దర్శకుడు శంకర్‌కు షాక్ ఇచ్చింది. ఈ మూవీ కోసం చరణ్ మూడేళ్ల శ్రమ వృధాఅయింది. అన్నేళ్లు కష్టపడినా శంకర్ ఎంచుకున్న కథలో దమ్ములేకపోవడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు పినీ లవర్స్‌ని కూడా తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. అయితే ఈ మూడేళ్ల విరామాన్ని తట్టుకోలేకపోతున్న చరణ్ ఎలాగైనా అర్జెంట్‌గా హిట్‌ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే ఆలోచనలో ఉన్నాడు.
ప్రస్తుతం బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో చరణ్ `పెద్ది` మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. `రంగస్థలం` తరహాలో 80ల నాటి కథతో తెరకెక్కుతోంది. క్రికెట్‌తో పాటు రెజ్లింగ్ నేపథ్యంలో ప్రధాన కథ సాగుతుందని తెలుస్తోంది. జెట్ స్పీడ్‌తో అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి 2026 మార్చి 27న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్‌ని ఇప్పటికే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫిక్స్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే చరణ్ మాత్రం ఈ ఏడాదే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్‌ని తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందు కోసం ఫాస్ట్‌గా పూర్తయ్యే ప్రాజెక్ట్‌ని టేకాఫ్ చేయాలని భావిస్తున్నాడు కానీ అది అనుకున్నంత ఈజీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. `పెద్ది` తరువాత సుకుమార్‌తో ఓ సినిమా కమిట్ అయ్యాడు చరణ్. దీనికి సమయం పట్టే అవకాశం ఉంది. కారణం సుక్కు దీనికి స్క్రిప్ట్ రెడీ చేయలేదు. ప్రస్తుతం `పుష్ప2` సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.
దీంతో యువీలో చిన్న ప్రాజెక్ట్‌ని రాకెట్‌స్పీడుతో పూర్తి చేయాలని చరణ్ ప్లాన్ చేశాడు కానీ ఏ కథ, దర్శకుడు అనుకున్న విధంగా సెట్ కావడం లేదట. త్వరలోనే ఓ డైరెక్టర్‌ని ఫైనల్ చేసి ప్రాజెక్ట్‌ని ఈ ఏడాది ఎండింగ్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. వెంట వెంటనే సినిమాని పూర్తి చేసి జెట్‌స్పీడ్‌తో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్.