చిరంజీవి సూపర్ హిట్ మూవీస్ రీమేక్ లో రామ్ చరణ్...
గత 50 సంవత్సరాలుగా టాలీవుడ్ లో సత్తా చాటుతున్న నటుడు చిరంజీవి... ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకపాత్ర వహించాడు.
By: Tupaki Desk | 14 Oct 2026 3:00 PM ISTగత 50 సంవత్సరాలుగా టాలీవుడ్ లో సత్తా చాటుతున్న నటుడు చిరంజీవి... ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకపాత్ర వహించాడు. చిరంజీవి హీరోగా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే 'ప్రజా రాజ్యం' పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ చేదు అనుభవం ఎదురవ్వడంతో పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి 'ఖైదీ నెంబర్ 150' మూవీతో ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించి చిరంజీవి చరిష్మా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. 70 సంవత్సరాల వయసులో మూవీస్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నాడు. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం 'గ్లోబల్ స్టార్' గా అవతరించాడు. 'త్రిబుల్ ఆర్' సినిమాలో ఆయన నటనకి హాలీవుడ్ మేకర్స్ నుంచి ప్రశంశలు దక్కాయి...
రామ్ చరణ్ రీమేక్ చేసే మూవీ...
చిరంజీవి ఎంటైర్ కెరియర్ లో చాలా గొప్ప సినిమాలు చేశాడు. ఆయన మూవీస్ కమర్షియల్ సక్సెస్ లను సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంశలను కూడా అందుకున్నాయి. చిరంజీవి సినిమాలను తన కొడుకు అయిన రామ్ చరణ్ రీమేక్ చేస్తే బాగుంటుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. చిరంజీవి సైతం రామ్ చరణ్ తన సినిమాలు చేస్తే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'గ్యాంగ్ లీడర్' లాంటి సినిమాలు రీమేక్ చేస్తే బాగుంటుందని చిరంజీవి గతంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రామ్ చరణ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఈ జనరేషన్ కి తగ్గట్టుగా పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించే రీతిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తే రామ్ చరణ్ ఆ రీమేక్ లను చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. మెగా అభిమానులు మాత్రం చిరంజీవి చేసిన క్యారెక్టర్ రామ్ చరణ్ చేస్తే చూడాలని అనుకుంటున్నారు. అలాగే చరణ్ యాక్టింగ్ లో కొత్త ఒరవడి చూపిస్తూ తండ్రిని మించిన తనయుడిగా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీలైనంత తొందరగా ఈ రీమేక్ లను స్టార్ట్ చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు...
రామ్ చరణ్ లైనప్
ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ఆయన ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ఇద్దరిలో ఎవరో ఒకరి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ ఇయర్ 'పెద్ది' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. దాంతో రాబోయే ప్రాజెక్టుల మీద ఆచితూచి ముందుకు అడుగులు వేయాలనే ఆలోచనతో ఉన్నాడు. అందుకే కథల ఎంపికలో తను చాలా వరకు వైవిధ్యాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది...
