చరణ్ చేతికి బ్యాండేజ్.. కంగారు పడుతున్న ఫ్యాన్స్
డ్రగ్స్ విషయంలో అందరూ వాటికి వ్యతిరేకంగా సైనికుల్లా పోరాడాలని బలమైన సందేశాన్నిచ్చారు రామ్ చరణ్.
By: Tupaki Desk | 27 Jun 2025 3:42 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురువారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డ్రగ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కు హాజరై తన మాటలతో అందరినీ ఎట్రాక్ట్ చేశారు. చరణ్ పాల్గొంది సినీ ఈవెంట్ కాకపోయినా తన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ డ్రగ్స్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాట్లాడారు.
డ్రగ్స్ విషయంలో అందరూ వాటికి వ్యతిరేకంగా సైనికుల్లా పోరాడాలని బలమైన సందేశాన్నిచ్చారు రామ్ చరణ్. ఈ మొత్తం కార్యక్రమంలో చరణ్ స్పీచ్ తో పాటూ అభిమానులు మరో విషయాన్ని కూడా గుర్తించి దాన్ని హైలైట్ చేశారు. రామ్ చరణ్ స్పీచ్ ఇస్తున్నప్పుడు అతని ఫ్యాన్స్ ఆయన చేతికి బ్యాండేజ్ ఉన్న విషయాన్ని గుర్తించి, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను వైరల్ చేశారు.
దీంతో ఫ్యాన్స్ చరణ్ చేతికి ఏమైంది? ఎందుకు బ్యాండేజ్ వేసుకున్నారు? అని ఆరా తీస్తుండగా, మరొకొందరు మాత్రం చరణ్ కు తన తర్వాతి సినిమా పెద్ది షూటింగ్ లో గాయం జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఈ గాయం వల్ల చరణ్ కు పెద్దగా నొప్పి అనిపించకపోయినా అతని హ్యాండ్ మూమెంట్స్ లో మాత్రం కొంత అసౌకర్యాన్ని మనం గమనించవచ్చు.
అయితే చరణ్ గాయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. చరణ్ ఈవెంట్ లో యాక్టివ్ గా పాల్గొనడం చూస్తే, ఆయన తీవ్రంగా గాయపడినట్టైతే అనిపించడం లేదు. గాయం చిన్నదైనా, పెద్దదైనా సరే ఫ్యాన్స్ మాత్రం ఆ బ్యాండేజ్ ను చూసి కంగారు పడుతున్నారు. చరణ్ తనకు జరిగిన గాయం గురించి చెప్పకపోయినా అభిమానులే దాన్ని గుర్తించి ఆ విషయంలో కంగారు పడటం చూస్తుంటే చరణ్ ను అతని ఫ్యాన్స్ ఎంతగా అభిమానిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు.
ఇక కెరీర్ విషయానికొస్తే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ తన పూర్తి ఫోకస్ ను బుచ్చిబాబు సానతో చేస్తున్న పెద్ది సినిమాపై పెట్టారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో శివరాజ్ కుమార్, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పెద్ది సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. వచ్చే ఏడాదిలో పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
