ఒకే గదిలో నాన్నతో రామ్ చరణ్ 20 రోజులు!
అయితే 'ఆచార్య' షూటింగ్ సమయంలో నాన్నతో గడిపిన 20 రోజులు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు చరణ్.
By: Tupaki Desk | 11 May 2025 2:30 PMనాన్నతో గడిపే క్షణాలు ఏవైనా ఉంటాయి? అంటే అది చిన్నప్పుడు మాత్రమే. ఆ వయసులోనే నాన్నతో గడిపే క్షణాలు ప్రతీ కుమారుడికి దక్కుతాయి. నాన్న ఎంత బిజీగా ఉన్నా? ఆ సమయంలో కుమారుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాడు. కానీ మరింత బిజీగా ఉండే తండ్రులు ఆ సమయాన్ని కూడా కేటా యించలేరు. అలా తండ్రితో గడిపే క్షణాలు కొందరు కుమారులు కోల్పోవాల్సి ఉంటుంది.
చిన్నప్పుడు అదే పరిస్థితి చూసాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ చిన్న వయసులో చిరంజీవి సినిమాలతో బిజీగా ఉండటంతో ఎక్కువగా సమయం గడపలేకపోయారుట. నిత్యం షూటింగ్ లతో బిజీగా ఉండటం ఇంటికొచ్చిన అది రాత్రి కావడంతో? కలిసే సమయం కూడా ఉండేది కాదుట. మళ్లీ ఉదయం సెట్స్ కి వెళ్తే రాత్రి అవ్వడం. ఇలా డాడ్ తో కొంత విలువైన సమయాన్ని కోల్పోయాడు చరణ్.
చరణ్ పెద్ద స్టార్ అయిన తర్వాత తాను బిజీగా ఉండటంతోనూ డాడ్ తో ఎక్కువగా ఉండలేకపోయే పరిస్థితి. అయితే 'ఆచార్య' షూటింగ్ సమయంలో నాన్నతో గడిపిన 20 రోజులు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు చరణ్. ఆ సినిమాలో ఇద్దరు కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఔట్ డోర్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో ఒకే గదిలో ఇద్దరు 20 రోజుల పాటు కలిసి ఉన్నారుట. అది తన కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఓ జ్ఞాపకంగా చరణ్ గుర్తు పెట్టుకున్నారు.
ఆరకంగా 'ఆచార్య' ఓ మంచి జ్ఞాపకంగా మిగిలిపోయిందన్నారు. భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన 'ఆచార్య' ఎలాంటి ఫలితం సాధించిందో తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షణ్ కంపెనీ -మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.