Begin typing your search above and press return to search.

రామ్ తో భాగ్యశ్రీ.. రింగ్ కామెంట్ తో క్లారిటీ!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే రిలేషన్ లో ఉన్నట్టు కొద్ది రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 April 2025 5:04 PM IST
రామ్ తో భాగ్యశ్రీ.. రింగ్ కామెంట్ తో క్లారిటీ!
X

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే రిలేషన్ లో ఉన్నట్టు కొద్ది రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఓ మూవీ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇద్దరూ.. తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో వేర్వేరుగా ఫోటోలు షేర్ చేసుకున్నారు.

కానీ రెండు ఫోటోల్లో బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉండడంతో కొందరు అతిగా కామెంట్స్ పెట్టారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోహీరోయిన్లు.. ఒకే హోటల్ లో స్టే చేయడం కామన్. హోటల్ కాబట్టి రూమ్స్ ఒకేలా ఉంటాయి. అందుకే రామ్, భాగ్యశ్రీ పిక్స్ లో బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉంది. దానికే డేటింగ్ అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేశారు.

అదే సమయంలో మరో నెటిజన్ భాగ్యశ్రీ పిక్ కు.. మీ హ్యాండ్ కు ఉన్న రింగ్ ఎవరు తొడిగారని క్వశ్చన్ చేశాడు. దీంతో భాగ్యశ్రీ సరైన విధంగా రెస్పాండ్ అయింది. ఆ రింగ్ తానే కొనుకున్నానని తెలిపింది. దీంతో తాను ఎవరితో రిలేషన్ లో లేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. అలా రామ్ తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది అమ్మడు.

ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో మంచి హిట్ అందుకున్న పి. మహేష్ బాబు దర్శకత్వంలో రామ్, భాగ్యశ్రీ సినిమా చేస్తున్నారు. అందులో రామ్ సాగర్ గా.. భాగ్యశ్రీ మహాలక్ష్మిగా సందడి చేయనున్నారు. ఇప్పటికే వారి ఫస్ట్ లుక్స్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మూవీపై పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ అయింది.

కొద్ది రోజుల క్రితం ఒక షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు మేకర్స్. స్పీడ్ గా మిగతా చిత్రీకరణను కంప్లీట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. పీరియాడికల్ లవ్ స్టోరీగా మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. వింటేజ్ రామ్ అండ్ భాగ్యశ్రీ అందచందాలను విట్నెస్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఆ సినిమాతో కాంత మూవీలోనూ యాక్ట్ చేస్తోంది భాగ్యశ్రీ. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఆ సినిమాలో టాలీవుడ్ హల్క్ రానా కీలక పాత్రలో నటిస్తున్నారు. రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన భాగ్యశ్రీ.. డెబ్యూతో అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుని సందడి చేస్తోంది.