Begin typing your search above and press return to search.

హీరోతో డాన్స్ అంటే? బాబోయ్ అనేసిందా!

రామ్ ఎన‌ర్జీని దృష్టిలో పెట్టుకుని ఓ ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ కంపోజ్ చేసిన పాట‌కు రామ్ డాన్స్ అద‌ర‌గొ డుతుంటే? భాగ్య శ్రీ మాత్రం మ్యాచ్ చేయ‌లేక క‌ష్ట‌ప‌డుతుందట‌.

By:  Tupaki Desk   |   4 Aug 2025 10:00 AM IST
హీరోతో డాన్స్ అంటే? బాబోయ్ అనేసిందా!
X

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ డాన్సింగ్ స్కిల్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ టాప్ -5 డాన్స‌ర్ల‌లో అతడొక‌డు. ఎలాంటి స్టెప్స్ అయినా అవ‌లీల‌గా దించ‌గ‌ల‌డు. ఒళ్లును విల్లులా వొంచ‌గ‌ల నేర్ప‌రి`. క‌ఠిన‌మైనా స్టెప్స్ సైతం సునాయాసంగా పూర్తి చేస్తాడు. అత‌డితో డాన్స్ అంటే కొరియోగ్ర‌ఫ‌ర్లు ఎంతో ఉత్సాహంగా ప‌ని చేస్తారు. అత‌డి లో ఆ గ్రేస్ ని దృష్టిలో పెట్టుకునే రామ్ ప‌క్క‌న నాయిక అంటే? అన్ని ర‌కాలుగా స‌రితూగే న‌టిని ఎంపిక చేస్తుంటారు. డాన్స్ లో అత‌డి స్పీడ్ ను అందుకునే లా ఉండాల‌న్న‌ది కొరియోగ్రాఫ‌ర్ల‌ భావ‌న‌.

హీరో-హీరోయిన్ మ‌ధ్య నాన్ సింక్

కానీ అలా అన్నిసార్లు సాధ్య ప‌డ‌దు. ప్ర‌స్తుతం అలాంటి స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం రామ్ క‌థానాయ‌కుడిగా మ‌హేష్ బాబు . పి . ద‌ర్శ‌క‌త్వంలో ' ఆంధ్రా కింగ్ తాలూకా' అనే ఓ చిత్రం తెర‌కె క్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శకు చేరుకుంది. మరోవైపు పాటల చిత్రీక ర‌ణ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో హీరో-హీరోయిన్ మ‌ధ్య డాన్స్ నాన్ సింక్ అవుతుంద‌నే విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. రామ్ స్పీడ్ ని హీరోయిన్ ఎంత మాత్రం మ్యాచ్ చేయ‌లేక‌పోతుందట‌.

అందులో స్పెష‌ల్ ట్రైనింగ్

రామ్ ఎన‌ర్జీని దృష్టిలో పెట్టుకుని ఓ ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ కంపోజ్ చేసిన పాట‌కు రామ్ డాన్స్ అద‌ర‌గొ డుతుంటే? భాగ్య శ్రీ మాత్రం మ్యాచ్ చేయ‌లేక క‌ష్ట‌ప‌డుతుందట‌. దీంతో కొరియోగ్రాఫ‌ర్లు అమ్మ‌డికి స్పెష‌ల్ ట్రైనింగ్ అందిస్తున్నారట‌. భాగ్య శ్రీ అదే పాట‌ను ట్రైన‌ర్ల స‌మ‌క్షంలో కొంత ప్రాక్టీస్ అనంత‌రం జాయిన్ అవుతుందట‌. పాట ముందు రోజే కొన్ని స్టెప్స్ ని ఇచ్చేసి ఇంటి ద‌గ్గ‌ర ప్రాక్టీస్ చేసుకుని రావాల్సిందిగా కోరిన‌ట్లు తెలుస్తోంది. భాగ్య శ్రీ బోర్సే ఇంత వ‌ర‌కూ మాస్ స్టెప్స్ తో అల‌రించింది లేదు. వాస్త‌వానికి ఆ ఛాన్స్ రాలేదని చెప్పాలి.

అభిమానుల కోసం త‌ప్ప‌లే

తెలుగులో హీరోయిన్ గా చేసింది కూడా రెండు సినిమాలే. ర‌వితేజ‌తో 'మిస్ట‌ర్ బ‌చ్చన్' ఒక‌టి కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించిన రీసెంట్ రిలీజ్ 'కింగ్ డ‌మ్' రెండ‌వ‌ది. 'కింగ్ డ‌మ్' లో డాన్సుకు అస‌లు స్కోపేలేదు. సినిమాలో హీరోతో ఎలాంటి పాట‌లు లేవు. వ‌చ్చిన రెండు పాట‌లు స్టోరీతో పాటే ట్రావెల్ అవు తాయి. అలా 'కింగ్ డ‌మ్' లో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. కానీ రామ్ తో అలా కుద‌ర‌దు. ఆ మాత్ర‌మైనా అల‌రించ‌క‌పోతే అభిమానులు ఊరుకోరు. అందుకే ఇప్పుడు అమ్మ‌డు అద‌నంగా స‌మ‌యం కేటా యిస్తోంది.