Begin typing your search above and press return to search.

హీరోయిన్ సినిమాకు రామ్ అతిధిగా ఇదే తొలిసారి!

మెగా ఫ్యామిలీతో కీర్తి సురేష్ కు ఉన్న బాండింగ్ కార‌ణంగా చ‌ర‌ణ్ అప్పుడ‌లా అతిధి అయ్యారు. అంత వ‌ర‌కూ రామ్ చ‌ర‌ణ్ కూడా ఏ హీరోయిన్ సినిమాకు అతిధిగా వెళ్ల‌లేదు. చ‌ర‌ణ్‌కి కూడా అదో కొత్త అనుభూతి.

By:  Tupaki Desk   |   10 Aug 2025 10:33 AM IST
హీరోయిన్ సినిమాకు రామ్ అతిధిగా ఇదే తొలిసారి!
X

టైర్ వ‌న్ హీరోలంటే ! టాప్ స్టార్లు తాము న‌టించిన సినిమా ప్ర‌చారంలో పాల్గొనేది ఒకే ఒక్క‌సారి. సినిమా రిలీజ్ కు ముందు నిర్వ‌హించే ప్రీ రిలీజ్ వేడుక‌లో మాత్రమే హీరోలు త‌ప్ప‌క పాల్గొంటారు. మిగ‌తా సంద ర్భాల్లో జ‌రిగే ఈవెంట్ల‌లో హీరోలు కనిపించ‌డం అన్న‌ది చాలా రేర్ గానే జ‌రుగుతుంది. ఒక‌వేళ క‌నిపించినా అది సినిమా ప్రారంభోత్వం రోజునో? టీజ‌ర్....ట్రైల‌ర్ ఈవెంట్ల‌లో చాన్స్ ఉంటుంది. ఇలాంటి ఈవెంట్ల‌లో స్టార్ హీరో పాల్గొన‌డం అన్న‌ది అతి క‌ష్టంమీద జ‌రుగుతుంది. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు న‌మ్మ‌కం పెట్టుకునేది ప్రీ రిలీజ్ ఈవెంట్ మీదనే.

కీర్తి సురేష్ కోసం చ‌ర‌ణ్‌:

ఆ రోజు మాత్రం హీరోలెంత బిజీగా ఉన్నా త‌ప్ప‌క హాజ‌ర‌వుతారు. అప్పుడ‌ప్పుడు ఇత‌ర స్టార్ హీరోల చిత్రా ల‌కు గెస్ట్ లుగా హాజ‌ర‌వుతుంటారు. ఇది చాలా రేర్ గా జ‌రుగుతుంది. ఆ హీరోతోనో, ద‌ర్శ‌కుడితోనో? ఉన్న ర్యాపో మీద ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. హీరోయిన్ ఓరియేంటెడ్ సినిమాల‌కైతే ఇలాంటి అద్భుతాలు ఇంకా రేర్ గా జ‌రుగుతాయి. హీరోయిన్ మాట కొట్టేయ‌లేక రావాల్సిన ప‌రిస్థితులు కొన్ని ఉంటాయి. అలాం టప్పు డు త‌ప్ప‌దు. గ‌తంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీర్తి సురేష్ న‌టించిన ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా కు అలాగే అతిధిగా హాజ‌ర‌య్యారు.

ఇదే తొలి అనుభ‌వం:

మెగా ఫ్యామిలీతో కీర్తి సురేష్ కు ఉన్న బాండింగ్ కార‌ణంగా చ‌ర‌ణ్ అప్పుడ‌లా అతిధి అయ్యారు. అంత వ‌ర‌కూ రామ్ చ‌ర‌ణ్ కూడా ఏ హీరోయిన్ సినిమాకు అతిధిగా వెళ్ల‌లేదు. చ‌ర‌ణ్‌కి కూడా అదో కొత్త అనుభూతి. ఇక మ‌హేష్‌, ఎన్టీఆర్, బ‌న్నీ లాంటి స్టార్లు అయితే అలాంటి ఈవెంట్ల‌కు హాజ‌రు కాలేదు. తాజాగా ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ మాత్రం అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `ప‌ర‌దా` ట్రైల‌ర్ ఈవెంట్లో రామ్ పాల్గోన‌డం విశేషం. ఇంత వ‌ర‌కూ రామ్ ఏ హీరోయిన్ సినిమా ఈవెంట్కు అతిదిగా హాజ‌ర‌వ్వ‌లేదు.

తెర వెనుక సూప‌ర్ జోడీ

తొలిసారి `ప‌ర‌దా` ఈవెంట్ లో క‌నిపిచండం విశేషం. అందుకు కార‌ణం లేక‌పోలేదు. అనుప‌మ రామ్ కి మంచి స్నేహితురాలు. గ‌తంలో ఇద్ద‌రు క‌లిసి కొన్ని సినిమాలు కూడా చేసారు. అలా మొద‌లైన స్నేహం నేటికి కొన‌సాగుతుంది. కీర్తి సురేష్ స‌హా ద‌ర్శ‌, నిర్మాత‌ల ఆహ్వానం మేర‌కు రామ్ హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. రామ్- అనుప‌మ క‌లిసి దిగిన ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆన్ ది స్క్రీన్ పై నా కాదు ఆఫ్ ది స్క్రీన్ లోనూ సూప‌ర్ జోడీ అంటూ నెటిజ‌నులు పోస్టులు పెడుతున్నారు.