Begin typing your search above and press return to search.

రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా.. ఎందుకు ఈ లేట్..?

సినిమాలో రామ్ భాగ్య శ్రీ జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది. రామ్ 22వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

By:  Tupaki Desk   |   13 April 2025 10:35 AM IST
Ram’s Mass Comeback with Andhra King Taluka!
X

ఉస్తాద్ రామ్ హీరోగా మహేష్ బాబు పి డైరెక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మొన్నటిదాకా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో రామ్ భాగ్య శ్రీ జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది. రామ్ 22వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. రాజమహేంద్రవరం లో లాంగ్ షెడ్యూల్ తో సినిమా మేజర్ పార్ట్ అయిపోగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ తో సినిమా ముగింపుకి వస్తుందని తెలుస్తుంది. ఐతే సినిమా చివరి దశకు చేరుకున్నా కూడా రామ్ సినిమా రిలీజ్ పై క్లారిటీ రాలేదు. సినిమా సమ్మర్ రేసుకి దించుతారన్న టాక్ వినిపించినా అది కుదిరే పరిస్థితి కనిపించట్లేదు.

రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా పక్కా హిట్ టార్గెట్ తో రాబోతుంది. ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీ విషయంలో ప్రతి అప్డేట్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఐతే సినిమా మొదలై చాలా టైం అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అంతేకాదు సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ రాలేదు. మరి ఈ సినిమా విషయంలో మేకర్స్ ఆలోచన ఏంటన్నది తెలియట్లేదు.

రామ్ ఈ సినిమా కోసం తన లుక్ మార్చేశాడు. యంగ్ లుక్ లో రామ్ అదరగొట్టేస్తాడని తెలుస్తుంది. రామ్ భాగ్య శ్రీ జోడీ కూడా అదిరిపోతుందని అంటున్నారు. స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ లతో వెనకపడ్డ రామ్ రాబోతున్న ఈ సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. రామ్ నుంచి రాబోతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీపై అంచనాలు బాగున్నాయి. ఐతే ఇది కేవలం లవ్ మాత్రమే కాదు యాక్షన్ తో కూడా మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. రామ్ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.