Begin typing your search above and press return to search.

నువ్వుంటే చాలే.. ఎక్కేసిందిగా..

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా.

By:  Tupaki Desk   |   18 July 2025 5:34 PM IST
నువ్వుంటే చాలే.. ఎక్కేసిందిగా..
X

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ అండ్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ఆ నువ్వుంటే చాలే రిలీజైంది. ఆంధ్రా కింగ్ తాలూకా బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అంటూ ఒక క్రేజీ లవ్ స్టోరీ తో వస్తున్నాడు రామ్. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ గా నువ్వుంటే చాలేని రిలీజ్ చేశారు.

యూత్ ఆడియన్స్ హృదయాలను మెలిపెట్టేలా నువ్వుంటే చాలే అంటూ ప్రేయసి కోసం ప్రేమికుడు పాడే పాటే ఇది. వివేక్, మెర్విన్ అద్భుతమైన మెడీగా ఈ సాంగ్ ఇచ్చారు. ఐతే ఈ సాంగ్ కి రెండు క్రేజీ థింగ్స్ ఏటంటే ఈ సాంగ్ కు లిరిక్స్ ని హీరో రామ్ ఇచ్చాడు. రామ్ లో ఇంత మంచి రైటర్ ఉన్నాడా అనిపించేలా ఈ సాంగ్ ఉంది. ఇక ఈ సాంగ్ ని కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఆలపించాడు.

తన కంపోజింగ్ లోనే కాదు వేరే వాళ్ల కంపోజిషన్ లో కూడా అనిరుద్ పాటలు పాడతాడు. ఈ క్రమంలో రామ్ కోసం ఆంధ్రా కింగ్ తాలూకా లో నువ్వుంటే చాలే సాంగ్ పాడారు. రామ్ లిరిక్స్, అనిరుద్ వోకల్స్ ఒక సాంగ్ కి ఇంతకన్నా ఏం కావాలి అనిపించేలా చేశారు. ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ గా.. ప్రేమికుల హృదయాలను మెప్పించేలా ఈ సాంగ్ ఉంది.

ఇక సాంగ్ లో రిలీజ్ చేసిన కొన్ని క్లిప్స్ చూస్తుంటే రామ్, భాగ్య శ్రీ జోడీ కూడా అదిరిపోయేలా ఉంది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఒక లవ్ స్టోరీగా వస్తుంది. ఈ సినిమా విషయంలో రామ్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఐతే మొదటి సాంగ్ గా వచ్చిన నువ్వుంటే చాలే వింటే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రామ్ కి కచ్చితంగా సూపర్ హిట్ ఇచ్చేలా ఉంది. రామ్, భాగ్య శ్రీ కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉండగా వివేక్, మెర్విన్ మ్యూజిక్ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంది.