Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : స్టైలిష్‌ అందాల రకుల్‌ అదుర్స్‌

అందమైన ఫోటోలను రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం ద్వారా సినిమాలు చేయకున్నా కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 10:48 AM GMT
పిక్‌ టాక్‌ : స్టైలిష్‌ అందాల రకుల్‌ అదుర్స్‌
X

టాలీవుడ్‌ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్‌ గా, అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ గా నిలిచిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తక్కువ సమయంలో టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకున్న ఈ అమ్మడు అంతే స్పీడ్‌ గా కెరీర్ లో డౌన్‌ ఫాల్‌ మొదలయ్యింది.


తెలుగు లో ఆఫర్లు తగ్గుతున్న సమయంలో బాలీవుడ్‌ లో ఈ అమ్మడు ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు సఫలం అయ్యాయి. అయితే అక్కడ కూడా ఎక్కువ కాలం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టార్‌ డమ్‌ ను కొనసాగించలేక పోయింది. వరుసగా రకుల్‌ నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.


నటిగా ఈ అమ్మడు నిరాశ పరిచినా కూడా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం అందంతో ఎప్పుడు కూడా ఫ్యాన్స్ ని మరియు ప్రేక్షకులను నిరాశ పరచలేదు. అందమైన ఫోటోలను రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం ద్వారా సినిమాలు చేయకున్నా కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది.

హీరోయిన్‌ గా రకుల్‌ ప్రీత్‌ సినిమాలు మరింత తగ్గాయి. అయితే ఇలాంటి స్టైలిష్ ఔట్ ఫిట్‌ మరియు ఆకట్టుకునే ఫోటో షూట్స్ కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసిన ఈ ఫోటోలు ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

మోడ్రన్‌, స్టైలిష్ లుక్‌ లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందం అదుర్స్ అన్నట్లుగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యేనా చూడాలి.