Begin typing your search above and press return to search.

ర‌కుల్ సెకెండ్ ఇన్నింగ్స్ ని ఆపేదెవ‌రు?

నిర్మాత జాకీ భ‌గ్నానీతో ర‌కుల్ ప్రీత్ సింగ్ జీవితాన్ని పంచుకున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 10:30 AM GMT
ర‌కుల్ సెకెండ్ ఇన్నింగ్స్ ని ఆపేదెవ‌రు?
X

నిర్మాత జాకీ భ‌గ్నానీతో ర‌కుల్ ప్రీత్ సింగ్ జీవితాన్ని పంచుకున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు. మ‌రి ర‌కుల్ ఇక‌పై సినిమాలు చేస్తుందా? లేక కుటుంబ జీవితానికే అంకిత‌మ వుతుందా? అంటే ర‌కుల్ య‌ధావిధిగా సినిమాలు చేస్తుంద‌ని తెలుస్తుంది. పెళ్లి కి-కెరీర్ కి సంబంధం లేద‌ని ఇప్ప‌టికే చాలా మంది నాయిక‌లు నిరూపించారు. పెళ్లి చేసుకుని సినిమాలు కొన‌సాగిస్తున్న వారెంతో మంది.


బాలీవుడ్ లో క‌రీనాకపూర్..దీపీకా ప‌దుకొణే..ప్రియాంక చోప్రా...ఐశ్వ‌ర్యారాయ్..రాణీ ముఖ‌ర్జీ..క‌త్రినా కైఫ్ లాంటి సీనియ‌ర్ భామ‌లెంతో మంది కొన‌సాగుతున్నారు. స‌మంత‌..లావ‌ణ్య త్రిపాఠి..కాజ‌ల్ అగ‌ర్వాల్ లాంటి భామ‌లు టాలీవుడ్ లో కొన‌సాగుతున్నారు. మ‌రి ఇంత మంది భామ‌లు సినిమాలు చేస్తుండ‌గా ర‌కుల్ ఎందుకు సినిమాల నుంచి త‌ప్పుకుంటుంది? అంటే అందుకు ఛాన్సే లేదు. ర‌కుల్ యధావిధిగా కెరీర్ కొన‌సాగిస్తుంది.

పెళ్లికి ముందే అమ్మ‌డు కొన్ని ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయింది. వాటి లో కొన్ని సెట్స్ లో ఉన్నాయి. ఒక‌టి రెండు చిత్రాలు ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త క‌థ‌ల‌కు సంబంధించి సంప్ర‌దింపులు వేగంగా జ‌రుపు కుంది. ర‌కుల్ యాక్టివిటీ ఇలా క‌నిపిస్తున్న‌ప్పుడు పెళ్లి అనేది ఆమెని ఎలా ఆప‌గ‌ల‌దు? అన్న డౌట్ రాక మాన‌దు. ఓ తెలుగు సినిమాకి కూడా సైన్ చేయ‌డానికి రెడీగా ఉంద‌ని తాజా స‌మాచారం.

ఆ ప్రాజెక్ట్ వివ‌రాలు ఏంటి? అన్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు గానీ ర‌కుల్ రేపోమాపో సైన్ చేస్తుంద‌ని టాక్ వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మార్కెట్ లో పెళ్లికాని భామ‌ల‌కంటే పెళ్లైన భామ‌ల‌కే ఎక్కువ గిరాకీ క‌నిపి స్తుంది. ఈ విష‌యంలో భార్యామ‌ణులు భ‌ర్తల ఇమేజ్ ని సైతం తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటున్నార‌ని చెప్పొచ్చు. పెళ్లైన హీరోయిన్ భ‌ర్త స్టార్ హీరోనో...పేరున్న న‌టుడో..నిర్మాత అయితే ఈవిడ‌ ఆయ‌న భార్య అంట క‌దా? అన్నిచోట్లా చ‌ర్చ‌కొస్తుంది. అది సినిమాకి ఎంత‌గానే ఉప‌యోగ ప‌డుతుంది.