Begin typing your search above and press return to search.

ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్ స్టెప్ ఏంటి..?

హిందీ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న రకుల్ ఫిబ్రవరి 21న గోవాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది.

By:  Tupaki Desk   |   1 March 2024 1:30 PM GMT
ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్ స్టెప్ ఏంటి..?
X

కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అనతికాలంలోనే టాప్ రేంజ్ కి వెళ్లింది. వరుస స్టార్ సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు అంతే త్వరగా కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది. చరణ్, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ సినిమాలతో హిట్ అందుకున్న రకుల్ సడెన్ గా రేసు నుంచి దూరమైంది. మహేష్ తో చేసిన స్పైడర్ ఫ్లాప్ కావడంతో ఆ ఇంపాక్ట్ కెరీర్ మీద మరింత పడింది. ఆ తర్వాత నాగార్జున మన్మథుడు 2 కూడా అదే ఫలితం ఇవ్వడంతో తెలుగులో అవకాశాలు రాలేదు.

చివరగా వైష్ణవ్ తేజ్ తో కొండపొలం సినిమా చేసిన రకుల్ ఆ సినిమా తర్వాత మళ్లీ మరో అవకాశాన్ని అందుకోలేదు. అటు బాలీవుడ్ లో కూడా అరకొర అవకాశాలతో అమ్మడు కెరీర్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తున్న రకుల్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తుంది. రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానిని పెళ్లాడింది రకుల్.

హిందీ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న రకుల్ ఫిబ్రవరి 21న గోవాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత సినిమాల విషయంలో రకుల్ స్టెప్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఎలాగు భర్త నిర్మాత కాబట్టి ఆమె కెరీర్ కు నో చెప్పకపోవచ్చు. పెళ్లి తర్వాత హీరోయిన్స్ ప్రయోగాలకు పెద్దపీట వేస్తారు. రకుల్ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కమర్షియల్ సినిమాల కన్నా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో అలరిస్తుందేమో చూడాలి.

స్టార్ హీరోయిన్ గా ఇప్పటికే తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన రకుల్ పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ కొనసాగిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే రకుల్ ఒకవేళ సినిమాలు చేసినా ఆమె చేసే సినిమాలు సంథింగ్ స్పెషల్ గా ఉండాలని అనుకుంటుందట. సినిమాల విషయంలో భర్త కూడా ఆమెకు ఫుల్ సపోర్ట్ గా ఉంటాడని టాక్.

సౌత్ సినిమాల్లో రకుల్ ఆఫర్ల విషయంలో ఆలోచించాల్సిందే కానీ హిందీలో మాత్రం రకుల్ ఎలాంటి ఛాన్స్ వచ్చినా చేసేందుకు రెడీ అంటుంది. పెళ్లి తర్వాత బాలీవుడ్ భామలు కూడా గ్లామర్ విషయంలో కూడా ఎక్కడ తగ్గట్లేదు. మరి వాళ్ల సరసన రకుల్ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా స్కిన్ షో చేస్తుందా.. గ్లామర్ రోల్స్ కి ఓకే చెబుతుందా అన్నది తెలియాల్సి ఉంది.