Begin typing your search above and press return to search.

ర‌కుల్ ఈ కొత్త లుక్‌తో షాకిచ్చింది

ఇటీవ‌ల త‌న జీవితం, సినిమా, సంబంధాల గురించి రకుల్ తాజాగా కాస్మోపాలిట‌న్ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో ఓపెనైంది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:46 AM GMT
ర‌కుల్ ఈ కొత్త లుక్‌తో షాకిచ్చింది
X

18 సంవత్సరాల వయస్సు నుండి మోడలింగ్ చేయడం ప్రారంభించిన ర‌కుల్ ప్రాంతీయ సినిమాల్లో అగ్ర క‌థానాయిక హోదాను అందుకుంది. ముఖ్యంగా తెలుగు-త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంది. హిందీ సినిమాలలో ఒక దశాబ్దం పాటు కెరీర్ ని కొన‌సాగించింది. ఇటీవ‌ల త‌న జీవితం, సినిమా, సంబంధాల గురించి రకుల్ తాజాగా కాస్మోపాలిట‌న్ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో ఓపెనైంది.


ఇంత‌లోనే ర‌కుల్ కాస్మోపాలిట‌న్ లుక్స్ పై ఇంట‌ర్నెట్ లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. తాజాగా కాస్మోపాలిట‌న్ మ్యాగ‌జైన్ కోసం ర‌కుల్ ర‌క‌రకాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ఈ ఫోటోషూట్ రొటీన్ కి భిన్నంగా వైవిధ్యంగా ఆక‌ట్టుకుంది. కానీ కొన్నిచోట్ల ర‌కుల్ షేప‌వుట్ అయి క‌నిపిస్తోంది. నిజానికి ర‌కుల్ ఇటీవ‌లి కాలంలో డైట్ ఎక్స‌ర్ సైజులు అంటూ టూమ‌చ్ గా ఫిట్నెస్ కాన్షియ‌స్ నెస్ చూపిస్తోంది. దీని ప్ర‌భావం త‌న లుక్ పై పూర్తి గా ప‌డింది. ఇటీవ‌ల ర‌కుల్ రూపం పూర్తిగా లీన్ గా మారింది. దీంతో మునుప‌టి ఛామ్ త‌న‌లో మిస్స‌యింద‌ని అభిమానులు భావిస్తున్నారు. అయితే స్లిమ్ లుక్ లో ర‌కుల్ హెల్దీ లైఫ్ స్టైల్ ని అనుస‌రిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ర‌కుల్ బ్లూ డిజైన‌ర్ డ్రెస్ లో ఫోజులివ్వ‌గా, అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది.

కాస్మోపాలిట‌న్ త‌న క్యాప్ష‌న్ లో ఇలా రాసింది. ``అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి, అప్రయత్నంగా అపూర్వమైన కవర్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఆర్మీ పెంపకం గురించి, ఆమె ఎందుకు వైఫల్యానికి భయపడదో.. తనను తాను ఎలా నిలబెట్టుకుంటుందో తెలిపారు`` అని క‌థ‌నం ప్ర‌చురించింది.

ఆర్మీ జీవన విధానంలో క్రమశిక్షణ.. ఏకాభిప్రాయం, క్రాఫ్ట్ పై ఆమెకున్న ప్రేమ వంటి అంశాల‌ను ముచ్చ‌టించిన‌ట్టు తెలిపింది. ప్ర‌స్తుతం ఫిబ్ర‌వ‌రి-మార్చి మ్యాగ‌జైన్ అందుబాటులో ఉంది. గత రెండేళ్ళుగా నేను ఎలాంటి పని చేయాలనుకుంటున్నానో అర్థం చేసుకున్నప్పటి నుండి, నేను అదే మానసిక స్థితిలో ఉన్నానని ర‌కుల్ తాజా ఇంట‌ర్వ్యూలో అన్నారు. నేను నమ్మశక్యం కాని పనిని, విభిన్న జాన‌ర్ లలో తెర‌కెక్కే సినిమాల్లో కొనసాగాల‌నుకుంటున్నాను. ఎందుకంటే నా పనిని నేను అమితంగా ఇష్టపడతాను. అలాగే నా వ్యక్తిగత వృత్తిపరమైన స్వభావాలకు అనుగుణంగా చాలా స్పృహతో స్క్రిప్టుల్ని ఎంపిక చేసుకుంటాను. నేను 18 లేదా 19 సంవత్సరాల వయస్సులో కెరీర్ ప్రారంభించిన సాధారణ అమ్మాయిగా మిగిలిపోవాలని అనుకుంటాను. నేను మోడలింగ్ చేయడం ప్రారంభించినప్పుడు ఓపిగ్గా ఉండడం చాలా ముఖ్యం. జీవించడానికి ఏకైక మార్గం స‌హ‌నం ప్ర‌ద‌ర్శించ‌డం .. అది లేక‌పోతే ప్రపంచంలో ముందుకు సాగ‌డం చాలా క‌ష్ట‌మైన పని అని తెలిపారు. ర‌కుల్ ప్రీత్ త‌న ప్రేమికుడు జాకీ భ‌గ్నానీని త్వ‌ర‌లో పెళ్లాడ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.