Begin typing your search above and press return to search.

వీడియో : కన్నుల విందుగా రకుల్‌ వివాహం

తాజాగా రకుల్ తన ఇన్ స్టా పేజ్ ద్వారా పెళ్లి వీడియోను షేర్ చేసింది. పెళ్లి వీడియో మొత్తంలో కూడా రకుల్‌ చాలా సంతోషంగా కనిపిస్తూ నవ్వుతూ ఉంది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 8:14 AM GMT
వీడియో : కన్నుల విందుగా రకుల్‌ వివాహం
X

అందాల ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్ సింగ్ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్నట్లుగా రకుల్‌ ప్రకటించి కూడా చాలా కాలం అయ్యింది. ఎట్టకేలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలో జరిగిన వీరి వివాహానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరు అయ్యారు.

మొదటి నుంచి కూడా రకుల్‌ పెళ్లి గురించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ కాన్సెప్ట్‌ ను రకుల్‌ ప్లాన్‌ చేసుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది... పెళ్లిలో రకుల్‌ ప్రీత్ సింగ్ చాలా చాలా సంతోషంగా కనిపించింది.

తాజాగా రకుల్ తన ఇన్ స్టా పేజ్ ద్వారా పెళ్లి వీడియోను షేర్ చేసింది. పెళ్లి వీడియో మొత్తంలో కూడా రకుల్‌ చాలా సంతోషంగా కనిపిస్తూ నవ్వుతూ ఉంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంతోషం ఆమెలో కనిపిస్తుంది. అందాల రకుల్‌ ప్రీత్‌ సింగ్ మరియు జాకీ భగ్నానీ ల యొక్క జోడీకి అంతా ఫిదా అవుతున్నారు.

పెళ్లి వేడుకలో రకుల్ మరియు జాకీ భగ్నానీ బాగా ఎంజాయ్ చేశారని కూడా ఆ ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది. మొత్తానికి రకుల్‌ ప్రీత్ సింగ్‌ వివాహ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూస్ ను మరియు లక్షల్లో లైక్స్ ను సొంతం చేసుకుంటుంది.

హీరోయిన్ గా ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుకోలేక పోయిన రకుల్‌ ప్రీత్ సింగ్ కెరీర్‌ పై ఆశలు వదిలేసుకుని పెళ్లికి సిద్దం అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ రకుల్‌ సన్నిహితులు మాత్రం పెళ్లి తర్వాత మళ్లీ బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో రకుల్‌ బిజీ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.