Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రకుల్‌ లో ఇంకా ఆ మెరుపు తగ్గలేదు

కెరటం సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్ తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకుంది

By:  Tupaki Desk   |   3 April 2024 11:56 AM GMT
పిక్ టాక్ : రకుల్‌ లో ఇంకా ఆ మెరుపు తగ్గలేదు
X

కెరటం సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్ తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే రకుల్‌ స్టార్‌ హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగడంలో విఫలం అయ్యింది. ఆమె సినిమాల ఎంపిక కారణంగా ఈ పరిస్థితి అనేది కొందరి అభిప్రాయం.

ఆ విషయం పక్కన పెడితే రకుల్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లు కావస్తున్నా.. ఆమె వయసు పెరుగుతున్నా కూడా అందం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. పై పెచ్చు ఆమె ఇంకాస్త అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్లు ఇలాంటి ఫోటోలు మరియు వీడియోలు చూసిన సమయంలో కామెంట్స్ చేస్తున్నారు.

నెట్టింట రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జోరు మామూలుగా లేదు. రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈసారి కూడా రకుల్‌ అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు మెరిసే ఔట్‌ ఫిట్ వల్ల రకుల్‌ మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఆమె చూపులో మెరుపు ఏమాత్రం తగ్గలేదు అంటూ ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ ఆమె అందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం కాస్త డల్‌ గా ఉన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కచ్చితంగా రాబోయే రోజుల్లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఆమె సన్నిహితులు మరియు ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.