Begin typing your search above and press return to search.

రెడ్ డ్రెస్ లో రచ్చ చేస్తున్న అమ్మడు..!

సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్స్ ఫోటో షూట్స్ కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు ఫోటో షూట్స్ అనేవి ఏదో ఒక మేగజైన్ తీస్తేనే చేసేవారు

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:36 PM GMT
రెడ్ డ్రెస్ లో రచ్చ చేస్తున్న అమ్మడు..!
X

సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్స్ ఫోటో షూట్స్ కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు ఫోటో షూట్స్ అనేవి ఏదో ఒక మేగజైన్ తీస్తేనే చేసేవారు. కానీ ఇన్ స్టాగ్రాం వచ్చాక తమకంటూ ఒక స్పెషల్ ఫోటో గ్రాఫర్ ని హైర్ చేసుకుని వారితో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేయిస్తున్నారు. ఎవరికి వారు ఎక్కడ తగ్గకుండా ఈ ఫోటో షూట్స్ ఉంటున్నాయి. ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రతి హీరోయిన్ ఇప్పుడు ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది.


వీరిలో తనకంటూ ప్రత్యేకత తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా రకుల్ ప్రీత్ సింగ్ తన ఫాలోవర్స్ ని అలరించేందుకు రెగ్యులర్ ఫోటో షూట్స్ చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు రెడ్ కలర్ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది. బార్బీ డాల్ లా కనిపించేస్తున్న రకుల్ ఈ ఫోటో షూట్ షూట్ లో తన పరువాలతో ఆడియన్స్ ని తన వల్లో వేసుకునే ప్రయత్నం చేస్తుంది.


స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ లా రకుల్ తన ట్రెండీ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా వచ్చిన రెడ్ కలర్ డ్రెస్ లో స్లీవ్ లెస్ అందాలతో రచ్చ చేస్తుంది అమ్మడు. తన గ్లామర్ ఫోటోలతో ఫాలోవర్స్ కి నిద్రలేకుండా చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది అమ్మడు. అందుకే తన ఫోటో షూట్స్ తో వారి హృదయాలను గాయం చేస్తుంది.

ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హిందీలో అయలాన్ తమిళంలో ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తుంది. కొండపొలం తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేని రకుల్ ఇక్కడ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని ఫీల్ అవుతుంది. అయితే రకుల్ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ అమ్మడిని వరుసగా తెలుగు సినిమాల్లో చూడాలని కోరుతున్నారు. టాలీవుడ్ లో ఎంత త్వరగా అయితే స్టార్ క్రేజ్ తెచ్చుకుందో అంతే త్వరగా కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది.

తెలుగులో అన్ లక్కీ వెంటాడుతున్నా ఇప్పటికీ ఇక్కడ ఛాన్స్ వస్తే చేసేందుకు రెడీ అంటూ హింట్లు ఇస్తుంది. స్టార్ హీరోలతో కాకపోయినా టాలీవుడ్ యంగ్ హీరోలతో అయినా సరే జత కట్టేందుకు రెడీ అంటుంది రకుల్. మరి ఫోటో షూట్స్ ప్రభావంతో అయినా ఆమెకు తెలుగులో అవకాశాలు వస్తాయేమో చూడాలి.