Begin typing your search above and press return to search.

స్పైసీ లుక్ లో రకుల్ జిగేల్

రకుల్ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది

By:  Tupaki Desk   |   11 Sep 2023 11:09 AM GMT
స్పైసీ లుక్ లో రకుల్ జిగేల్
X

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు చాలా ముద్దుగా ఉన్న రకుల్ ఆ తర్వాత జిమ్, వర్కౌట్స్, ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి చాలా సన్నపడింది. అలా సన్నపడిన తర్వాత ఒకప్పటి రకుల్ ని మిస్ అయ్యాం అని చాలా మంది ఫీలయ్యారు. అయితే, ఇప్పుడు మళ్లీ పాత రకుల్ ని చూసిన ఫీల్ కలిగింది.


రకుల్ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. తాజాగా రెండు కలర్ ప్రింటెడ్ ఫ్రాక్ ధరించింది. ఆ డ్రెస్ లో రకుల్ రెడ్ కలర్ లాగే హాట్ గా స్పైసీగా కనపడుతోంది. అయితే, ఈ ఫోటోల్లో రకుల్ చాలా అందంగా కనపడుతున్నారు. ఆ మధ్య మరీ సన్నపడినా, ఇప్పుడు పాత రకుల్ చూసిన అనుభూతి కలుగుతోంది.

అందుకే, ఆమె అందం రెట్టింపు అయినట్లు అనిపిస్తోంది.ఈ ఫోటోల్లో తన ఎద అందాలు కనిపించేలా ఆమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. ఫోటోలు చాలా హాట్ గా ఉన్నాయని, క్రేజీగా ఉన్నాయని , వావ్ అంటూ ఎక్కువ మంది కామెంట్స్ చేస్తుండటం విశేషం.

కాగా, రకుల్ కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసింది లేదు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడింది. స్టార్ హీరోలందరితోనూ ఆడిపడిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది.

అక్కడ, ఆమెకు వెంట వెంటనే చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అవి కనుక హిట్ అయ్యి ఉండిఉంట, బాలీవుడ్ లో పాతుకుపోయేది. కానీ, ఆమె నటించిన ఏ సినిమా బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయింది. దాదాపు ఐదు సినిమాల్లో నటించినా, అన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

దీంతో, గోడకు కొట్టిన బంతిలా మళ్లీ దక్షిణాదిన ఆఫర్ల కోసం ప్రయత్నాలు మొదలుుపెట్టింది. తెలుగులో అయితే, ఎలాంటి ఆఫర్లు లేవు కానీ, తమిళం నుంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.