Begin typing your search above and press return to search.

ర్యాంప్ షో కోసం స్టైలిష్ట్ ఛార్జ్‌ రోజుకు ల‌క్ష‌!

ఈ అనుభ‌వాల‌న్నిటినీ తాజా ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. కెరీర్ ఆరంభం ఒక ర్యాంప్ షోకి వెళితే మ‌న వెంటే ఒక స్టైలిష్ట్ ఉండాల‌న్న జ్ఞానం కూడా త‌న‌కు లేద‌ని చెప్పుకొచ్చింది.

By:  Tupaki Desk   |   23 Aug 2025 8:52 PM IST
ర్యాంప్ షో కోసం స్టైలిష్ట్ ఛార్జ్‌ రోజుకు ల‌క్ష‌!
X

ముంబైలో రెడ్ కార్పెట్ ఈవెంట్లు, జోష్ ఉన్న పార్టీల‌కు ఎటెండ‌వ్వాలంటే ఒక్కొక్క స్టార్ ఎంత ఖ‌ర్చు చేస్తారో తెలుసా? తెలిస్తే నోరెళ్ల‌బెడతారు. పెళ్లిళ్ల‌కు తిన‌డానికి వెళితే స‌రిపోదు.. షో చేయ‌డం కూడా చాలా ఇంపార్టెంట్. ప్ర‌ముఖులంద‌రి క‌ళ్లు మ‌న‌వైపే ఉంటాయి గ‌నుక‌, అక్క‌డ మ‌నం ధ‌రించే దుస్తుల ఖ‌రీదు, మేక‌ప్, లుక్, చేతికి ధ‌రించే హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్ ఇలా ప్ర‌తిదీ ల‌గ్జ‌రీగా క‌నిపించ‌డం ముఖ్యం.

అల్ట్రా స్టైలిష్ గా, ల‌గ్జ‌రియ‌స్ గా ఉంటే స‌రిపోదు.. బ్రాండ్ కూడా చాలా ముఖ్యం. పార్టీ క్రౌడ్ దూరం నుంచే అది ఏ బ్రాండ్? అనేది క‌నిపెట్టేస్తారు. దానిపైనే అంద‌రి క‌ళ్లు ఉంటాయి. ఇక ఏదైనా బ్రాండ్ కి ప్ర‌మోష‌న్ చేయాలంటే క‌థానాయిక‌ల‌కు అర్హ‌త ముఖ్యం. ఏదైనా ఈవెంట్ కి వెళితే షో స్టాప‌ర్ గా నిల‌వాలి. అంద‌రి క‌ళ్లు మ‌న‌వైపే ఉండాలి.

ఈ అనుభ‌వాల‌న్నిటినీ తాజా ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. కెరీర్ ఆరంభం ఒక ర్యాంప్ షోకి వెళితే మ‌న వెంటే ఒక స్టైలిష్ట్ ఉండాల‌న్న జ్ఞానం కూడా త‌న‌కు లేద‌ని చెప్పుకొచ్చింది. అంతేకాదు... స్టైలిష్ట్ కోసం లేదా మేక‌ప్ మేన్ ఇత‌ర టీమ్ కోసం ఖ‌ర్చు చాలా ఉంటుంద‌ని కూడా ర‌కుల్ చెప్పుకొచ్చింది. ఈవెంట్ ని బ‌ట్టి రూ.20,000 నుంచి దాదాపు రూ.1,00,000 వ‌ర‌కూ స్టైలిష్ట్ కోసం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని కూడా వెల్ల‌డించింది. స్టైలిష్ట్ కి తెర‌వెన‌క సిబ్బంది, ఇత‌ర వ్యాప‌కాలు చాలా ఖ‌రీదైన‌వి. ఏదో ఒక ఈవెంట్ కోసం అంత పెద్ద మొత్తం అవ‌స‌ర‌మా? అనుకోవ‌డానికి లేదు. అక్క‌డ వారికి ఫిక్స్ డ్ గా భ‌త్యం అందించాల్సిందే. లేదంటే ఆ రోజు, ఆ షోలో లుక్ ప‌రంగా చిక్కుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రెడ్ కార్పెట్ ఈవెంట్ కోసం సెల‌క్టివ్ గా స్టైలిస్ట్, ఫోటోగ్రాఫర్, హెయిర్ డ్రెస్స‌ర్, మేకప్ బృందం త‌ప్ప‌న‌సరి. వారి రేంజ్ పై మ‌నకు అయ్యే ఖ‌ర్చు ఆధార‌ప‌డి ఉంటుంది. బాలీవుడ్‌లో ఇమేజ్ కీలక పాత్ర పోషిస్తుంది. ముంబై చిత్ర పరిశ్రమలో భాగం కావడం కేవలం నటనకు మించినద‌ని రకుల్ అన్నారు. వ్య‌క్తుల మ‌ధ్య‌ సంబంధాలు, లుక్, మ‌న పొజిష‌న్ ఎలాంటిది? ప్ర‌చారం చేసే బ్రాండ్ ఏమిటి? అనేవి డిసైడ్ చేస్తాయి. వీట‌న్నిటి ఆధారంగా మ‌న‌ల్ని అంచ‌నా వేస్తారు.

నా కెరీర్ ప్రారంభ రోజుల్లో ప్రమోషనల్ ఈవెంట్లలో స్టైలిస్ట్ అవసరం చూసి ఆశ్చర్యపోయానని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రమోషన్ల సమయంలో నేను స్టైలిస్ట్‌ని తీసుకోవాల్సి ఉంటుందని నాకు తెలీదు ప్ర‌మోష‌న్లు ప్రారంభించే ముందే అన్నీ తెలుసుకున్నాను.. ఇది చాలా ఖ‌రీదైన వ్య‌వ‌హార‌మ‌ని అర్థ‌మైందని ర‌కుల్ తెలిపారు. మోడ‌ల్ లేదా న‌టికి అంత‌ర్జాతీయ లుక్స్ కావాల‌నుకుంటే, దానికి త‌గ్గ‌ట్టే ఖ‌ర్చు కూడా అమాంతం పెరుగుతుంద‌ని ర‌కుల్ తెలిపింది. రాజ్ ష‌మ‌ణితో పాడ్ కాస్ట్ లో పైవిష‌యాల‌ను ర‌కుల్ ముచ్చ‌టించింది.

ప్రియాంక చోప్రా జోనాస్ 2021లో అంత‌ర్జాతీయ బ్రాండ్ బ‌ల్గారీకి గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికైంది. భారత మార్కెట్లో తన బలమైన ప్రభావంతో అంతర్జాతీయ ఆకర్షణను సమతుల్యం చేయ‌గ‌ల న‌టి ప్రియాంక చోప్రా. దీపికా పదుకొనే సంవత్సరాలుగా లూయిస్ విట్టన్‌కి ప్ర‌చారం చేస్తోంది. గూచీ బ్రాండ్‌కి ఆలియా అంబాసిడ‌ర్ గా ఉంది. అంత‌ర్జాతీయ ల‌గ్జ‌రి లేబుల్స్ ప్ర‌చారంలో భార‌తీయ తార‌ల ప‌నిత‌నం ప్ర‌శంసించి తీరాలి. వీరంతా ప్ర‌పంచ ఫ్యాష‌న్ హౌస్ ల దృష్టిని నిరంత‌రం ఆక‌ర్షిస్తూనే ఉన్నారు. కానీ స్టైలిష్టుకు ఒక ఈవెంట్ కోసం రోజుకు ల‌క్ష చెల్లించాలంటే ఎవ‌రైనా స్టార్ సంపాద‌న ఏ రేంజులో ఉండాలో అర్థం చేసుకోవాలి.