Begin typing your search above and press return to search.

కొత్త కారు కొన్న రకుల్.. ధరెంతో తెలుసా?

మెర్సిడెస్ మేబాచ్ కారును కొనుగోలు చేయగా, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   23 Aug 2023 11:02 AM GMT
కొత్త కారు కొన్న రకుల్.. ధరెంతో తెలుసా?
X

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. రకుల్ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు తనలోని ఫ్యాషన్ సెన్స్ ని బయటకు తీస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూలుక్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా రకుల్ కొత్త కారు కొనుగోలు చేసింది.

మెర్సిడెస్ మేబాచ్ కారును కొనుగోలు చేయగా, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ కారు బేసిక్ మోడల్ ధర రూ.2.69కోట్లు, అదే హై ఎండ్ మోడల్ కారు అయితే రూ.3.40 కోట్లు వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రెటీలు ఈ మోడల్ కారునే కొనుగోలు చేస్తుండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కూడా ఇదే కారు కొనుగోలు చేయడం విశేషం.

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కూడా ఇదే కారు కొనుగోలు చేసింది. చాలా మంది సెలబ్రెటీలు ఈ మోడల్ కారు అంటే పడి చచ్చిపోతున్నారు. మంచి కంఫర్ట్ తో పాలు, లగ్జరీగా ఉండటంతో, అందరూ ఇదే కారును కొనాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో రకుల్ కూడా చేరడం విశేషం.

కాగా, రకుల్ కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసింది లేదు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడింది.ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఎలాంటి ఛాన్స్ లేకపోయినా, బాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంటోంది.

రకుల్ నటించిన సినిమా ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఒక్కటి కూడా హిట్ కాలేదు. అయినప్పటికీ, ఆమెకు అక్కడ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా ఓ తమిళ సినిమాలో అవకాశం లభించినట్లు తెలుస్తోంది. దీంతో, మళ్లీ ఈ సినిమాతో దక్షిణాది జనాలకు రకుల్ దగ్గరయ్యే అవకాశం ఉంది. మళ్లీ రకుల్ దక్షిణాదిన మంచి కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.