Begin typing your search above and press return to search.

ర‌కుల్ లావిష్ పెళ్లి బిల్లులు పెద్దవే సుమీ

తాజాగా ఈ జంట వెడ్డింగ్ కార్డ్ బీచ్‌సైడ్ వేడుక గురించి వివ‌రాలు అందించింది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 12:37 PM GMT
ర‌కుల్ లావిష్ పెళ్లి బిల్లులు పెద్దవే సుమీ
X

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ప్రియుడు జాకీ భగ్నానీతో ఫిబ్రవరి 21న జరగనుంది. ఈ వేడుక గురించిన వివరాల‌ను ఈ జంట ముందుగా వెల్లడించలేదు. త‌న‌ దుస్తులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయ‌డం ద్వారా ర‌కుల్ ప్రీవెడ్డింగ్ వేడుకలను ప్రారంభించినట్టు వెల్ల‌డించింది. ర‌కుల్ మెరిసే షరారా బృందంలో అబ్బురపరిచింది. తాజాగా ఈ జంట వెడ్డింగ్ కార్డ్ బీచ్‌సైడ్ వేడుక గురించి వివ‌రాలు అందించింది.

ర‌కుల్ పెళ్లి వేడుక విలాసవంతమైన అరోసిమ్‌లోని ITC గ్రాండ్ గోవా రిసార్ట్ & స్పాలో వైభ‌వంగా జ‌రుగుతోంది. ఈ రిసార్ట్ 45 ఎకరాలలో విస్తరించి ఉంది.. బీచ్ ఫేసింగ్ గదులు ఈ రిసార్ట్ లో ఉన్నాయి. ఖ‌రీదైన‌ సూట్‌లు ఈవెంట్ అతిథుల‌కు ఆహ్లాదాన్నిచ్చేవిగా డిజైన‌ర్ లుక్ తో ఉన్నాయి. ఫిబ్రవరి 19న వివాహానికి ముందు జరిగే వేడుకలు పెళ్లి రోజు వరకు.. ఈ హోటల్‌లో గ‌దుల‌ను బుక్ చేసారు. ఒక సూట్ గది ఖరీదు రోజుకు రూ.80వేలు అవుతుందని తెలుస్తోంది. ఇలాంటి సూట్ గ‌దులు, ఏసీ గ‌దుల‌ను అతిథుల కోసం బుక్ చేసారు. ఇండ‌స్ట్రీ సెల‌బ్రిటీల లావిష్ వేడుక‌ల‌కు ఈ పెళ్లి వేడుక కూడా ఎంత‌మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని స‌మాచారం.

జూనియర్ ఎన్టీఆర్ - నాన్న‌కు ప్రేమతో, అల్లు అర్జున్ - సరైనోడు, రామ్ చ‌ర‌ణ్ -ధృవ.. ర‌కుల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. మ‌హేష్ స‌ర‌స‌న `స్పైడ‌ర్` లాంటి భారీ యాక్ష‌న్ చిత్రంలోను ర‌కుల్ న‌టించింది. ఇప్పుడు ర‌కుల్ పెళ్లిలో త‌న హీరోలు ఎన్టీఆర్, బ‌న్ని, చ‌ర‌ణ్, మ‌హేష్ కూడా సంద‌డి చేస్తార‌ని అభిమానులు భావిస్తున్నారు. అయితే ర‌కుల్ పెళ్లి వేడుక‌ అతిథుల జాబితాలో వీరంతా ఉన్నారా లేదా? అన్న‌ది కూడా ఇప్ప‌టికి స‌స్పెన్స్.