Begin typing your search above and press return to search.

వీడియో : భర్తతో ఛాలెంజ్‌ డాన్స్ అదరగొట్టింది

పెళ్లి తర్వాత మరోసారి రకుల్‌, జాకీ భగ్నానీ జంటగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   5 March 2024 9:22 AM GMT
వీడియో : భర్తతో ఛాలెంజ్‌ డాన్స్ అదరగొట్టింది
X

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్ మరియు బాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా ఒకానొక సమయంలో నిలిచిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇప్పటికి కూడా రకుల్‌ కి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా మంచి క్రేజ్ ఉంది. ముందు ముందు మళ్లీ సినిమాలతో ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశాలు లేక పోలేదు.

ఆ విషయం పక్కన పెడితే ఇటీవలే వైభవంగా రకుల్‌, జాకీ భగ్నానీ వివాహం జరిగిన విషయం తెల్సిందే. గోవాలో జరిగిన ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. అందమైన ఈ జంట ఫోటోలు మరియు వీడియో లు తెగ వైరల్‌ అయ్యి, కన్నుల పండుగగా నిలిచింది.

ఆకట్టుకునే అందంతో పాటు పక్కన జాకీ భగ్నానీ ఉండటంతో రకుల్‌ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత మరోసారి రకుల్‌, జాకీ భగ్నానీ జంటగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు.

డాన్స్‌ ఛాలెంజ్‌ లో భాగంగా హీరో టైగర్‌ ష్రాఫ్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ ని స్వీకరిస్తూ వీరిద్దరు మస్త్‌ మలంగ్‌ ఝుమ్‌ పాటకు స్టెప్స్ వేసి రీ క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ రీల్‌ సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. డాన్స్‌ ఛాలెంజ్‌ లో ఈ కొత్త జంట అదరగొట్టారు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. జాకీ భగ్నానీ హీరోలా ఉన్నాడు... ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్ గా సినిమా చేయాలని మరి కొందరు ఉచిత సలహా ఇస్తున్నారు.