అందంగా కనిపించడానికి లక్షలు ఖర్చు చేయాలి
తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లోని అగ్ర హీరోలందరితోనూ నటించింది.
By: Tupaki Desk | 30 March 2025 5:00 AM ISTతక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లోని అగ్ర హీరోలందరితోనూ నటించింది. ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్ రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని సెలబ్రిటీలకు ఉండే ఖర్చుల గురించి తెలిపింది.
సెలబ్రిటీలకు ఎలాంటి ఖర్చులుండవు. ఆఖరికి వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే వాళ్లు వేసుకునే బట్టలతో సహా ఎవరొకరు ఫ్రీగా పంపుతారని అందరూ అనుకుంటారు. కానీ తమకుండే ఖర్చులు తమకుంటాయని, కాస్ట్యూమ్స్ ఫ్రీ గా ఇచ్చినా మేకప్, హెయిర్ స్టైలిస్టులకు తామెంతో డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని రకుల్ వెల్లడించింది.
రెడ్ కార్పెట్ పై సెలబ్రిటీలు అందంగా కనిపించాలంటే దాని వెనుక ఎంతోమంది శ్రమ, కష్టం ఉంటాయని, జస్ట్ ఒక్క లుక్ కోసం తాము రూ.20 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, స్టైలిస్ట్ నుంచి మేకప్ టీమ్ కు, ఫోటోగ్రాఫర్లకు ఇలా ప్రతీ ఒక్కరికీ డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని, దీని కోసం తనకొక టీమ్ కూడా ఉందని రకుల్ చెప్పింది.
ఆరేళ్లుగా తన దగ్గర మేకప్, హెయిర్ స్టైలిస్ట్ కోసం ఒకే టీమ్ పని చేస్తుందని, వాళ్లను తాను ఫ్యామిలీ మెంబర్స్ లానే ట్రీట్ చేస్తానని రకుల్ చెప్పుకొచ్చింది. ఈవెంట్స్ కోసం తమకు ఫ్రీ గా బట్టలు పంపించినప్పటికీ దాన్ని తెచ్చిన వారికి, ఆ డ్రెస్ కు తగ్గట్టు తమని అందంగా రెడీ చేసిన వారికి డబ్బులివ్వాల్సి ఉంటుందని రకుల్ తెలిపింది.
కొరియర్ ఛార్జీలు కూడా అందులోనే యాడ్ చేస్తారని, ఎవరైనా ఇంటర్నేషనల్ డిజైనర్ పంపిన డ్రెస్ వేసుకోవాలంటే ఆ ఖర్చు ఇంకా అదనంగా ఉంటుందని రకుల్ చెప్పింది. డిజైనర్లు తమకు డ్రెస్సులు ఫ్రీ గా ఇచ్చేది ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు వాటికి ఎక్కువ అటెన్షన్ వస్తుందని, దాని వల్ల వారికి సేల్స్ పెరుగుతాయని మాత్రమేనని, అయితే తాను మాత్రం ఎక్కువ శాతం ఫ్రీ గా బట్టలు తీసుకోవడడానికి ఇష్టపడనని రకుల్ చెప్పింది.
