సముద్రపు అందంతో రకుల్ గ్లామర్ స్టిల్స్.. స్టన్నింగ్!
సినిమా ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది
By: Tupaki Desk | 26 April 2025 4:35 PMసినిమా ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తన అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకున్న రకుల్, తన స్టైలిష్ లుక్స్‌తోనూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ఆమె సినిమాలతో పాటు ఫిట్నెస్, ట్రావెల్, గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది.
ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని అద్భుతమైన బీచ్ ఫోటోలను షేర్ చేసింది. ఓ యాచ్‌పై సముద్రం నడుమ మధురమైన క్షణాలను ఆస్వాదిస్తూ ఆమె తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మల్టీకలర్ డిజైన్ ఉన్న గ్లామరస్ డ్రస్‌లో రకుల్ లుక్ వేరే లెవెల్ అనేలా ఉంది. గోగుల్స్ ధరించి న్యూట్రల్ మేకప్‌తో తన నాచురల్ అందాన్ని మరింతగా హైలైట్ చేసింది.
ఫోటోలలో రకుల్ సముద్రం వైపు కళ్ళు మూసుకుని నిలబడిన పోజ్, చూస్తూ చిరునవ్వుతో ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు ఫ్యాన్స్‌ను ఫిదా అయ్యేలా చేశాయి. ఎలాంటి హంగు లేకుండా పర్ఫెక్ట్ సమ్మర్ వేకేషన్ వైబ్స్‌ని ఇచ్చేలా రకుల్ కనిపించింది. తన శరీర భంగిమ, నడవడికతో కూడిన ఈ ఫోటోలు గ్లామర్‌కు మరో అర్థాన్ని ఇచ్చాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
‘వీకెండింగ్ హియర్ ఇన్ మై హెడ్’ అనే క్యాప్షన్‌తో రకుల్ పోస్ట్ చేసిన ఈ పిక్స్, ఫ్యాన్స్ నుంచి మాత్రమే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా భారీగా లైక్స్, కామెంట్స్ రాబట్టుకుంటున్నాయి. కొందరు ఫాలోవర్స్ అయితే "ఈ లుక్స్ స్టన్నింగ్" అంటూ ముచ్చటపడిపోతున్నారు. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్, టాలీవుడ్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. త్వరలోనే భారీ సినిమాల్లో కనిపించబోతోంది. తన గ్లామర్‌తో పాటు ఫిట్నెస్కి కూడా ప్రాధాన్యం ఇస్తూ అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ బీచ్ లుక్‌తో రకుల్ మరోసారి స్టైలిష్ క్వీన్ అనిపించుకుంది.