ఫోటో స్టోరి: రకుల్ సమ్మోహన రూపానికి ఫిదా
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ముంబై చిత్రసీమలోను రకుల్ ఫ్యాషనిస్టా వైబ్స్ కి ఫిదా అవ్వని వారు లేరు.
By: Tupaki Desk | 23 Jun 2025 9:21 AM ISTసౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ముంబై చిత్రసీమలోను రకుల్ ఫ్యాషనిస్టా వైబ్స్ కి ఫిదా అవ్వని వారు లేరు. అక్కడ నటుడు, ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ ఈ బ్యూటీతో నిండా ప్రేమలో మునిగిన సంగతి తెలిసిందే. రకుల్- భగ్నానీ జంట వివాహం అనంతర జీవనశైలి గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది.
ఈ జంట చాలా కోణాల్లో ఆదర్శ జంట. ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమంలో గౌరవనీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. యోగా డే ఉత్సవాల నుంచి భర్త జాకీ భగ్నానీతో రకుల్ యోగా ఫీట్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. రకుల్ నిరంతర ఫోటోషూట్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా హిందూస్తాన్ టైమ్స్ కోసం స్పెషల్ ఫోటోషూట్ లో పాల్గొంది రకుల్. ఇది ఫ్యాషనిస్టా రకుల్ లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. రకుల్ ఫోటోషూట్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని పొగిడేస్తే తప్పు లేదు. రకుల్ ముగ్ధ మనోహర రూపాన్ని ఫోటోగ్రాఫర్ క్యాప్చుర్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటోంది. రకుల్ పూసలతో రూపొందించిన డిజైనర్ టాప్ ధరించి అందంగా కనిపించింది. ఆ మెడలో అలంకరించిన డిజైనర్ ఆభరణం, చెవులకు డిజైనర్ లోలాకుల కాంబినేషన్ ఎంతగానో ఆకర్షిస్తోంది. అలాగే డిజైనర్ బ్రీడ్స్ బ్లౌజ్ కి తగ్గట్టే పొడవాటి లెహంగాను రకుల్ ధరించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే రకుల్ చివరిగా భారతీయుడు 2 (ఇండియన్ 2)లో కనిపించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. తదుపరి భారతీయుడు 3లో నటించాల్సి ఉంది.. కానీ దీనికి సంబంధించిన అప్ డేట్ లేదు. అలాగే అజయ్ దేవగన్ సరసన దేదే ప్యార్ దే 2లోను రకుల్ నటిస్తోంది.
