పిక్‌టాక్ : రకుల్ సొగసు చూడ తరమా..!
తాజాగా ఈమె HT సిటీ షోస్టాపర్స్ అనే డిజిటల్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ ఇచ్చింది. ఆ ఫోటో షూట్‌లో ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
By: Tupaki Desk | 28 April 2025 12:00 AM ISTరకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేనంత బిజీగా సినిమాలు చేసిన విషయం తెల్సిందే. ఈమె కోసం నెలల తరబడి వెయిట్ చేసిన హీరోలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. అలాంటి స్టార్‌డం దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ సమయంలోనే టాలీవుడ్‌కి దూరం అయింది. టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. అయితే బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు దక్కినా లక్ కలిసి రాకపోవడంతో అక్కడ కూడా ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేవు. అయినా కూడా సోషల్ మీడియాలో ఈమె జోరు తగ్గడం లేదు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈమె దే దే ప్యార్ దే 2 సినిమాలో నటిస్తోంది. 2019లో వచ్చిన దే దే ప్యార్ దే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్‌పై అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో రకుల్ ప్రీత్ సింగ్‌కి నటిగా మంచి పేరును తెచ్చి పెట్టింది. అంతే కాకుండా రకుల్ అందాన్ని చూపించేందుకు కూడా స్కోప్ దక్కింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్‌కి పెద్దగా క్రేజ్ లేదు. అయినా కూడా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఏ ఫోటోలు షేర్ చేసినా వైరల్ అవుతూనే ఉంటాయి. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈమె సొంతం అంటూ ఉంటారు. అందుకే ఈమెను అత్యధికులు అభిమానిస్తూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు ఏకంగా 2.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న విషయం తెల్సిందే.
తాజాగా ఈమె HT సిటీ షోస్టాపర్స్ అనే డిజిటల్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ ఇచ్చింది. ఆ ఫోటో షూట్‌లో ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రకుల్ సొగసు చూడ తరమా అన్నట్లుగా ఈ పోటోలు ఉన్నాయి. అందమైన రకుల్ ప్రీత్ సింగ్ అంతకు మించిన అందమైన ఔట్ ఫిట్ ధరించి, ఒక పెయిటింగ్ మాదిరిగా ఫోజ్ ఇస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ ఫోటోలో ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంతటి అందగత్తెకు టాలీవుడ్‌లో రావాల్సిన ఆఫర్లు రావడం లేదు, దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు అంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత కెరీర్ ఆరంభంతో పోల్చితే ఏమాత్రం తగ్గలేదని కూడా కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
టాలీవుడ్‌లో 2011లో కేరటం సినిమాతో అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్‌కి 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మంచి గుర్తింపు లభించింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ అమాతం పెరిగింది. టాలీవుడ్‌లో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య, రవితేజ, రామ్, మంచు మనోజ్, గోపీచంద్ వంటి స్టార్స్‌తో సినిమాల్లో నటించింది. కోలీవుడ్‌లోనూ ఈమె పలువురు స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. అందం విషయంలో ఏమాత్రం తగ్గని ఈ అమ్మడు ముందు ముందు మళ్లీ ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
