Begin typing your search above and press return to search.

ధగధగా మెరిసిపోతున్న రకుల్.. వ్వాటే లుక్!

సిల్వర్ క్రిస్టల్ వర్క్ ఉన్న బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్​లో ఎంతో గ్లామరస్​గా కనిపించింది. స్లీక్ హెయిర్​స్టైల్, మినిమల్ యాక్సెసరీస్​తో తన లుక్​ను హైలెట్ చేసింది.

By:  Tupaki Desk   |   18 Oct 2025 8:00 AM IST
ధగధగా మెరిసిపోతున్న రకుల్.. వ్వాటే లుక్!
X

టాలీవుడ్, బాలీవుడ్​లలో స్టార్ హీరోయిన్​గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. నటనతోనే కాకుండా, తన ఫ్యాషన్ సెన్స్, ఫిట్​నెస్​తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్​లో ఉంటుంది. తాజాగా ఓ అవార్డుల వేడుకలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ మ్యాగజైన్ నిర్వహించిన ఈవెంట్​లో రకుల్ స్టైలిష్ లుక్​లో ధగధగా మెరిసిపోయింది.

సిల్వర్ క్రిస్టల్ వర్క్ ఉన్న బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్​లో ఎంతో గ్లామరస్​గా కనిపించింది. స్లీక్ హెయిర్​స్టైల్, మినిమల్ యాక్సెసరీస్​తో తన లుక్​ను హైలెట్ చేసింది. ఈ వేడుకలో ఆమె "ఎల్లే ప్యూర్ ప్రజెన్స్" అవార్డును కూడా అందుకుంది.

కెరీర్ ప్రారంభంలో టాలీవుడ్​లో వరుస విజయాలతో టాప్ హీరోయిన్​గా ఎదిగింది రకుల్. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

ఆ తర్వాత బాలీవుడ్​పై ఫోకస్ పెట్టి, అక్కడ కూడా సక్సెస్​ఫుల్ హీరోయిన్​గా నిలదొక్కుకుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాది, ఉత్తరాది భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కమల్ హాసన్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'ఇండియన్ 3'లో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు మరికొన్ని హిందీ సినిమాలకు కూడా సైన్ చేసింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బిజినెస్​లతో రకుల్ తన కెరీర్​ను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది.

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూనే, గ్లామర్​లోనూ ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్స్​ను అలరిస్తూ కెరీర్​లో ముందుకు సాగుతోంది. అలాగే హిందీలో హిట్టయిన దేదే ప్యార్ దే సీక్వెల్ తో పాటు పతి పత్నీ ఔర్ వో పార్ట్ 2లో కూడా నటిస్తోంది. సక్సెస్ రేటు గతంలో కంటే కాస్త తగ్గినా కూడా మార్కెట్ లో తన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక రాబోయే సినిమాలు అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.