రకుల్ శుభవార్త చెప్పినా కానీ..!
రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగాక, హిందీ చిత్రసీమకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 April 2025 3:43 PMరకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగాక, హిందీ చిత్రసీమకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సౌత్ ప్రాజెక్టుల కోసం ఇక్కడికి వస్తోంది. అయితే ఇటీవలి కాలంలో రకుల్ కెరీర్ ఆశించినంతగా వెలగలేదు. సౌత్, నార్త్ రెండు చోట్లా ఖాళీ అయింది. ఇటీవలే విడుదలైన చిన్న సినిమా `మేరే హస్బెండ్ కి బివి` థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోవడం రకుల్‌ను తీవ్రంగా నిరాశపరిచింది.
అయితే ఇప్పుడు ఈ పంజాబీ బ్యూటీ ఒక మంచి వార్త చెప్పింది. తన సినిమా మేరే హజ్బెండ్ కి బివి ఓటీటీలో గొప్ప ఆదరణ పొంది నంబర్ వన్ గా ట్రెండింగ్ అవుతోందని తెలిపింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమాని జనం చక్కగా ఆదరిరిస్తున్నారు. అయితే ఈ శుభవార్తను చెప్పేందుకు రకుల్ ఆగలేకపోయింది. `వీక్ 2 అండ్ గోయింగ్ స్ట్రాంగ్` అని ఈ వార్తకు క్యాప్షన్ ఇచ్చింది. మొత్తానికి థియేటర్లలో అంతగా చూడని సినిమాని ఓటీటీలో వీక్షించేందుకు ఆడియెన్ ఆసక్తిని కనబరిచారు.
అయితే రకుల్ మంచి వార్త చెప్పింది కానీ, తన గురించి జీవితంలో గుడ్ న్యూస్ చెబుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ రకుల్ ప్రీత్ ఇంకా ఎలాంటి శుభవార్తను అందించలేదు. ప్రస్తుతానికి రకుల్ ఫ్రెగ్నెన్సీ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రకుల్ అంతగా జనాలకు ఆసక్తి లేని రెండు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఇండియన్ 3 ఎప్పుడొస్తుందో తెలీదు. దేదే ప్యార్ దే సీక్వెల్ లోను రకుల్ నటిస్తుందని ప్రచారం ఉంది. కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.