రకుల్ ప్రీత్ సింగ్ ప్రెగ్నెంటా? అందుకే అలా చేస్తుందా?
వాటి వెనుక కారణం తెలియకపోయినా గర్భిణీ అవ్వడం వల్ల డ్రెస్సింగ్ సెన్స్ లో ఛేంజ్ తీసుకొచ్చిందని నెటిజన్లు అంటున్నారు.
By: Tupaki Desk | 14 April 2025 11:38 PM ISTస్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ.. కొంతకాలం క్రితం బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. ఆ తర్వాత బీటౌన్ యాక్టర్, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీని ప్రేమించిన అమ్మడు.. గత ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన ఆయనతో ఏడడుగులు నడిచింది.
అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకతో రకుల్, జాకీ ఒకటయ్యారు. తొలుత.. వారిద్దరి వివాహం పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో జరగ్గా.. ఆ తర్వాత వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ గ్రాండ్ గా జరిగింది. రీసెంట్ గా రకుల్, జాకీ.. తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. జాకీ, రకుల్ జంట.. త్వరలో తల్లిదండ్రులు కానున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ విషయాన్ని అధికారికంగా వారిలో ఎవరూ రివీల్ చేయనప్పటికీ అది నిజమేనని నెటిజన్లు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతారని అంటున్నారు.
నిజానికి రకుల్.. టైట్ ఫిట్ అండ్ గ్లామర్ డ్రస్సుల్లో ఎప్పటికప్పుడు కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఫుల్ కంఫర్ట్ అండ్ ఫ్రీ డ్రెస్సుల్లో సందడి చేస్తుంది. వాటి వెనుక కారణం తెలియకపోయినా గర్భిణీ అవ్వడం వల్ల డ్రెస్సింగ్ సెన్స్ లో ఛేంజ్ తీసుకొచ్చిందని నెటిజన్లు అంటున్నారు. దీనికి తోడు జాకీ పోస్ట్ చేసిన వీడియో బలం చేకూర్చింది.
తమ కిచెన్ లో ఎంతో ప్రేమగా వంట చేస్తూ కనిపించారు జాకీ. దీంతో ఆ వీడియో వైరల్ కావడంతో రకుల్ కోసం జాకీ వంట చేస్తున్నట్లు ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు. అదే సమయంలో కొంతకాలంగా కొత్త ప్రాజెక్టులకు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పర్సనల్ బ్రేక్ తీసుకుంటానని ఆమె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఇవన్నీ ఎగ్జాంపుల్ గా చూపిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే తల్లి కాబోతుందని అంతా చెబుతున్నారు. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ పీరియడ్ ను ఎంజాయ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. జాకీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారని తెలుస్తోంది. మరి రకుల్ ప్రెగ్నెన్సీ వార్తల్లో నిజమెంత అనేది వాళ్లకే తెలియాలి.
