రకుల్ రిటైర్మెంట్ తీసుకోదంట!
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కెరీర్ అనంతరం అమ్మడు బాలీవుడ్ టార్గెట్ గా సినిమాలు చేస్తోంది.
By: Tupaki Desk | 20 May 2025 11:48 AM ISTరకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కెరీర్ అనంతరం అమ్మడు బాలీవుడ్ టార్గెట్ గా సినిమాలు చేస్తోంది. మధ్యలో కోలీవుడ్ లో అవకాశాలు వస్తే అక్కడా సినిమాలు చేస్తోం ది. ఇప్పటికే అమ్మడి కెరీర్ ప్రారంభమై 15 ఏళ్లకు పైగా పూర్తయింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ని ప్రేమించి వివాహం చేసుకుంది. అయినా సినిమాలకు మాత్రం నోబ్రేక్ అంటూ కంటున్యూ అవుతుంది.
కెరీర్ పరంగా భర్త నుంచి పూర్తి సహకారం ఉండటంతోనే సంతోషంగా కొనసాగుతుంది. ఏ నటికైనా ఏదో ఒక దశలో రిటైర్మెంట్ తప్పదు. కానీ రకుల్ డిక్షనరీలో మాత్రం ఎలాంటి రిటైర్మెంట్ లేదంటోంది. జీవి తాంతం సినిమాలు చేస్తూనే ఉంటానని తెలిపింది. సినిమాల నుంచి ఏ దశలోనే రిటైర్మెంట్ తీసుకోనని అంటోంది. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమేనని...దాన్ని చూసి పనిచేయడం తగ్గించుకోవాలి అనే దాన్నినమ్మనంటోంది.
`ఇండస్ట్రీకి చాలా ఆశలతో వచ్చాను. సినిమా ప్రారంభించిన కొత్తలో కొన్నేళ్లు మాత్రమే ఒక అమ్మాయి హీరోయిన్ గా రాణించగలదని అన్నారు కొందరు. కానీ ఇప్పుడా పరిస్థితులు మారుతున్నాయి. అద్భుతంగా పని చేసినన్ని రోజులు వయసుతో సంబంధం లేకుండా పరిశ్రమలో రాణించే అవకాశం ఉంటుంది` అని తెలిపింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ 34 ఏళ్లు. ఇండస్ట్రీలో ఇంకా చాలా కెరీర్ ఉంది. 2009లో గల్లి అనే కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
రెండేళ్లకు `కెరటం` అనే తెలుగు సినిమాలో నటించింది. ఏడాది గ్యాప్లో తమిళ్ లోనూ లాంచ్ అయింది. అక్కడ రెండు..మూడు సినిమాలుచేసిన అనంతరం `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ `సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రకుల్ నటిగా బిజీ అయింది.
