Begin typing your search above and press return to search.

పామాయిల్ వంట‌కాలు ఆత్మ‌హ‌త్యాస‌దృశం: ర‌కుల్ ప్రీత్

భార‌త‌దేశంలో ప్ర‌తి కుటుంబం క‌చ్ఛితంగా వంట‌ల‌కు పామాయిల్ వినియోగిస్తుంది. కేర‌ళ‌లో కొబ్బ‌రి నూనె వంట‌కాలు తింటారని విన్నాం కానీ, ఈ ఫార్ములా ఇత‌ర రాష్ట్రాల్లో ఆచ‌రణ సాధ్యం కాలేదు.

By:  Tupaki Desk   |   7 July 2025 10:30 AM IST
పామాయిల్ వంట‌కాలు ఆత్మ‌హ‌త్యాస‌దృశం: ర‌కుల్ ప్రీత్
X

భార‌త‌దేశంలో ప్ర‌తి కుటుంబం క‌చ్ఛితంగా వంట‌ల‌కు పామాయిల్ వినియోగిస్తుంది. కేర‌ళ‌లో కొబ్బ‌రి నూనె వంట‌కాలు తింటారని విన్నాం కానీ, ఈ ఫార్ములా ఇత‌ర రాష్ట్రాల్లో ఆచ‌రణ సాధ్యం కాలేదు. పామాయిల్ తో స‌ర్వ‌రోగాలు కానుక‌గా వ‌స్తాయ‌ని వైద్యులు విశ్లేషించార‌ని చెబుతున్నారు ఫిట్నెస్ ఫ్రీక్ ర‌కుల్ ప్రీత్ సింగ్. దాని కార‌ణంగా తాము బ‌య‌టి ఆహారం తీసుకోకుండా, కేవ‌లం ఇంట్లో వంట‌లే తింటున్నామ‌ని, పామాయిల్ స్థానంలో నెయ్యి, కొబ్బ‌రి నూనె వంటి ప్ర‌త్యామ్నాయాల‌ను ఉప‌యోగిస్తున్నామ‌ని ర‌కుల్ ప్రీత్ తెలిపారు.

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం రోజున సెలబ్రిటీ క‌పుల్ ర‌కుల్ ప్రీత్- భ‌గ్నానీ జంట `ఫిట్ ఇండియా క‌పుల్` పేరుతో ప్ర‌భుత్వ స‌త్కారం అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆరోగ్య సూత్రాల‌ను పాటించ‌డం, యోగా, జిమ్ వంటి సాధ‌నాల‌తో నిరంత‌రం ఫిట్ గా క‌నిపించే ఈ జంట దేశంలోని అంద‌రికీ ఆద‌ర్శం అనే గౌర‌వం అందుకున్నారు.

అందుకే ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ -జాకీ భగ్నాని జంట చెబుతున్న‌ట్టు ఇంట్లో వంట‌కాల కోసం నెయ్యిని ఉప‌యోగించ‌డం మేల‌ని భావించాలి. సాధ్య‌మైనంత తొంద‌ర‌గా పామాయిల్ వినియోగాన్ని వ‌దిలించుకోవాలి. పామాయిల్ వినియోగం ఆత్మ‌హ‌త్యా స‌దృశం. నెయ్యి లేదా కొబ్బ‌రి నూనె త‌ప్ప ఇంట్లో వేరొక నూనె వినియోగంచ‌ము అని ర‌కుల్ తెలిపారు. తమ వంటగది తోటలో తమ సొంత కూరగాయలను పండించాల‌నే ఆలోచ‌న రావ‌డానికి కార‌ణం.. పంట దిగుబ‌డి కోసం ఎరువులు, ర‌సాయ‌నాల దుర్వినియోగ‌మేన‌ని ర‌కుల్ - భ‌గ్నానీ జంట చెబుతున్నారు. వీటి వ‌ల్ల క్యాన్స‌ర్లు రావడం, యువ దంప‌తుల‌కు పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డం, గుండె పోటు, కిడ్నీ స‌మ‌స్య‌లు ఇత‌ర‌త్రా స‌ర్వ‌రోగాలు వ‌స్తున్నాయ‌ని వైద్యులు ధృవీక‌రించిన‌ట్టు ర‌కుల్ వెల్ల‌డించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కూ సొంతంగా పండించుకోవ‌డం, పామాయిల్ స్థానంలో నెయ్యిని వినియోగించ‌డం, సొంతంగా వండుకు తిన‌డం ఆరోగ్యానికి మేలు అని ఈ జంట చెబుతున్నారు.

చడం గురించి మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచ క్యాన్సర్ రాజధానిగా మారుతోందని చెప్పే ఒక కథనాన్ని తాము చూశామని భగ్నాని హోస్ట్ కామియా జానితో అన్నారు. పురుగుమందులు, ఎరువులు దిగుబడిలో ఉన్నాయి. మీరు దాని గురించి ఏమీ చేయలేరు. మనం ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఇవన్నీ చేస్తున్నామని మేము గ్రహించాము.. కానీ పదార్థాలు సరిగ్గా లేకపోతే, మనం ఎలా చేయగలం?

పామాయిల్‌లో ఇతర కూరగాయల నూనెలతో పోలిస్తే చాలా ఎక్కువ శాతం సంతృప్త కొవ్వులు ఉంటాయి.

బ‌యోటెక్ నిపుణుల ప్ర‌కారం.. పామాయిల్‌లో ఉండే సంతృప్త కొవ్వులు LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో ముందుంటాయి. దీనివ‌ల్ల‌ గుండెపోటు, స్ట్రోక్‌ల వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్ర‌మాదం పొంచి ఉంది. ధమనులలో LDL కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అథెరోస్క్లెరోసిస్ వస్తుంది. ఇది రక్త నాళాలను ఇరుకుగా చేస్తుంది. కీలకమైన అవయవ పనితీరును దెబ్బతీస్తుంది. ఆక్సిడైజ్డ్ పామాయిల్ వల్ల హార్మోన్ల అసమతుల్యత స‌హా విషప్రయోగం జ‌రిగిన‌ట్టేన‌నే ఆందోళ‌న‌ను న్యూట్రిష‌నిస్టులు క‌న‌బ‌రిచారు. ఇది పునరుత్పత్తి (పిల్ల‌ల పుట్టుక‌) సమస్యలకు దారితీస్తుంది.. కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల వంటి ముఖ్యమైన అవయవాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆమె పేర్కొన్నారు.