Begin typing your search above and press return to search.

ప్రతి రోజూ నా కోసం చేస్తారా.. భర్త రకుల్ రిక్వెస్ట్‌

జాకీ వంట చేస్తూ ఉండగా రకుల్‌ మీరు ప్రతి రోజు నా కోసం దీన్ని తయారు చేస్తారా అంటూ ప్రశ్నించింది. అందుకు జాకీ సిగ్గు పడుతూ సరే అన్నట్టుగా సంజ్ఞ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   3 April 2025 6:44 PM IST
ప్రతి రోజూ నా కోసం చేస్తారా.. భర్త రకుల్ రిక్వెస్ట్‌
X

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంను ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలంలో జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా బిజీగా ఉండటంతో పాటు, క్రేజ్ ఉన్న సమయంలో పెళ్లి వద్దనే ఉద్దేశంతో వాయిదా వేస్తూ వచ్చింది. ఇండస్ట్రీలో కాస్త డల్‌ కావడంతో పాటు ఆఫర్లు తగ్గిన కారణంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి పీటలు ఎక్కింది అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానిల వివాహం గత ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఇటీవల వీరు తమ వివాహ మొదటి వార్షికోత్సవంను జరుపుకున్న విషయం తెల్సిందే. ఫస్ట్‌ వార్షికోత్సవం కోసం విదేశాలకు ఈ జంట వెళ్లారు.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా వీరిద్దరి ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్ తన భర్త వంటగదిలో ఉన్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో జాకీ భగ్నాని పోహా చేస్తున్నాడు. రకుల్‌ కోసం స్వయంగా అతడు దాన్ని తయారు చేస్తున్నాడు. అది చాలా సింపుల్‌గా చేసేదే అయినా కూడా భార్య రకుల్‌ కోసం అతడు చాలా శ్రద్ద పెట్టి మరీ చేస్తున్నాడు. అతడు చేస్తున్న తీరు చూస్తూ ఉంటే రకుల్‌పై అతడికి ఉన్న ప్రేమ కనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రేమగా వంట చేసి పెట్టే భర్త లభించడం అనేది ఆమె అదృష్టం అంటూ రకుల్‌ గురించి కామెంట్‌ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

జాకీ వంట చేస్తూ ఉండగా రకుల్‌ మీరు ప్రతి రోజు నా కోసం దీన్ని తయారు చేస్తారా అంటూ ప్రశ్నించింది. అందుకు జాకీ సిగ్గు పడుతూ సరే అన్నట్టుగా సంజ్ఞ ఇచ్చాడు. నటిగా ఈమధ్య మళ్లీ బిజీ అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. తమిళ్‌లోనూ ఈమె సినిమాలు చేస్తుంది. మరో వైపు జాకీ భగ్నాని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఆయన నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇండస్ట్రీలో వీరిద్దరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలా సరదాగా టైం గడుపుతూ ఉన్నారు. బాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ లో వీరిద్దరు ముందు ఉంటారు అనడంలో సందేహం లేదని రకుల్‌ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒకానొక సమయంలో వరుసగా సినిమాలు చేసింది. మహేష్ బాబు వంటి స్టార్‌ హీరోల సినిమాలు మొదలుకుని చిన్న హీరోల సినిమాల్లోనూ నటించింది. స్టార్‌ హీరోల సినిమాలకు డేట్లు ఇవ్వలేనంత బిజీగా సినిమాలు చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో కనుమరుగు అయింది. అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని భావిస్తోంది. మరి ఈమెకు అక్కడ ఇక్కడ తిరిగి ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.