అది విని నాన్న భరించలేకపోయారు
రీసెంట్ గా రకుల్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెలబ్రిటీల పై వచ్చే రూమర్ల గురించి, వాటి ప్రభావం తమపై, తమ కుటుంబం ఎలా పడుతుందనే విషయాన్ని వెల్లడించింది.
By: Tupaki Desk | 2 Jun 2025 5:10 PM ISTకెరటం అనే బై లింగ్యువల్ ఫిల్మ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పండగ చేస్కో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో, జయ జానకి నాయక ఇలా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన రకుల్ తన ప్రేమికుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా రకుల్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెలబ్రిటీల పై వచ్చే రూమర్ల గురించి, వాటి ప్రభావం తమపై, తమ కుటుంబం ఎలా పడుతుందనే విషయాన్ని వెల్లడించింది.
సభ్య సమాజంలో ఏదైనా సరే ఒకటి ఉంటే దాన్ని పదింతలు చేసి చెప్పడం, లేనివి కల్పించడం, పుకార్లు పుట్టించడం సహజం. సినీ ఇండస్ట్రీలో ఆ రూమర్లు ఇంకాస్త ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఆ రూమర్లను లైట్ తీసుకుంటే, మరికొందరు మాత్రం వాటిపై క్లారిటీ ఇస్తూ అసలు విషయాలను బయటపెడుతూ ఉంటారు. ఇప్పుడు రకుల్ కూడా తన గురించి వచ్చిన ఓ రూమర్ పై క్లారిటీ ఇచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ కు హైదరాబాద్ లో ఓ ఇల్లుందనే సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో రకుల్ ఉండే ఇల్లు ఆమె సంపాదించిన డబ్బుతో కొనుక్కున్నది కాదని, ఎవరో పొలిటీషియన్ ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడనే వార్త అప్పట్లో బాగా ప్రచారమైంది. తాజాగా రకుల్ దీనిపై మాట్లాడి క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఇంటిని ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారనే వార్త చూసి తన తండ్రి చాలా కోప్పడ్డారని తెలిపింది.
ఆ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వర్క్స్ నుంచి అన్నీ స్వయంగా ఆయనే చూసుకున్నారని, అలాంటి ఇంటిని వేరెవరో గిఫ్ట్ ఇచ్చారనే వార్తలు విని ఆయన భరించలేక పోయారని, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న ఇల్లు ఎవరో గిఫ్టుగా ఇచ్చారని ఎలా అంటారని ఫైర్ అయ్యారని, దానికి తాను ఇలాంటి రూమర్లకు మనం రెస్పాండ్ అయ్యే పన్లేదని చెప్పానని, కానీ తన తండ్రి మాత్రం వాళ్లకు సమాధానం చెప్పాల్సిందేనని పట్టు బట్టారని, చివరకు ఎలాగోలా ఆయనకు నచ్చచెప్పినట్టు రకుల్ చెప్పుకొచ్చింది.
