Begin typing your search above and press return to search.

వీడియో: ర‌కుల్ ప్రీత్ విలాసాల ఇల్లు ఓ లుక్కేయండి

తాజాగా ర‌కుల్ ప్రీత్ సొంత ఇంటి సౌంద‌ర్యాన్ని ఆవిష్క‌రించే వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

By:  Tupaki Desk   |   25 Jun 2025 6:00 AM IST
వీడియో: ర‌కుల్ ప్రీత్ విలాసాల ఇల్లు ఓ లుక్కేయండి
X

స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ - జాకీ భ‌గ్నానీ జంట అన్యోన్య‌త‌, హ్యాపీ లైఫ్ ఇటీవ‌ల అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. ఈ జంట ఇంట‌ర్నేష‌న‌ల్ యోగా డే రోజున మోదీ ప్ర‌భుత్వం నుంచి `ఫిట్ ఇండియా క‌పుల్` పుర‌స్కారం అందుకున్న సంగ‌తి తెలిసిందే. రంగుల ప్ర‌పంచంలో ప‌రిచ‌యం, అటుపై లవ్ లైఫ్ గురించి తెలిసిందే. 21 ఫిబ్రవరి 2024న వివాహం చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో వివాహం తర్వాత ఈ అందమైన జంట తమ సొంత ఇంటిని నిర్మించుకున్నారు.

ఈ జంట క‌ల‌ల ఇంటి కోసం కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్ ని వెచ్చించారు. ఇది ఒక అంద‌మైన విలాసాల మ‌ల్టీస్టోరీడ్ బిల్డింగ్. ఇందులో పై అంత‌స్తులో అంద‌మైన స్విమ్మింగ్ పూల్, లివింగ్ రూమ్ ఏరియా, రూఫ్ టాప్ గార్డెన్ ప్ర‌తిదీ ఎంతో సౌక‌ర్య‌వంతంగా డిజైన్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా తాను నిత్య జీవితంలో ప‌నితో అల‌సిపోయిన‌ప్పుడు స్విమ్మింగ్ పూల్ లో రిలాక్స్ అవుతామ‌ని ర‌కుల్ చెబుతున్నారు.

ఇది మోడ్ర‌న్ డే డిజైనర్ లుక్ తో అద్భుతమైన ఆర్కిటెక్చ‌ర్ తో నిర్మించిన‌ది. ఇక ఈ ఇంట్లో ఏ మూల చూసినా అంద‌మైన‌ ఆర్ట్ వ‌ర్క్ ఆక‌ర్షిస్తుంది. మైండ్ కి ప్ర‌శాంత‌తనిచ్చేలా ఓపెన్ ప్లేసెస్ తో ఎంతో విశాలంగా క‌నిపిస్తుంది. స్టేట్‌మెంట్ సీలింగ్‌లు, ఆర్ట్ డెకో యాక్సెంట్‌లతో ఇంటీరియర్ మోడ్ర‌న్ ట‌చ్ తో ఇల్లు ఆక‌ట్టుకుంది. బోల్డ్ లుక్ తో రంగురంగుల ఆర్ట్‌వర్క్, ప్రత్యేకమైన లైటింగ్ ఫిక్చర్‌లు ఇంటిని శోభాయ‌మానంగా ఆవిష్క‌రించాయి. ఇల్లు ప్రశాంతతను పెంచే గాలి , వెలుతురు, ఓపెన్ స్పాట్స్ తో హాయిని గొలుపుతోంది. తాజాగా ర‌కుల్ ప్రీత్ సొంత ఇంటి సౌంద‌ర్యాన్ని ఆవిష్క‌రించే వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

రీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ర‌కుల్ చివ‌రిగా భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2)లో క‌నిపించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి భార‌తీయుడు 3లో న‌టించాల్సి ఉంది.. కానీ దీనికి సంబంధించిన అప్ డేట్ లేదు. అలాగే అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న దేదే ప్యార్ దే 2లోను ర‌కుల్ న‌టిస్తోంది.