వోడ్కా బాటిల్‌తో రకుల్ లవ్ షురూ!
'కెరటం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ లక్కీగా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 16 July 2025 6:00 PM IST'కెరటం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ లక్కీగా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఒకానొక సమయంలో మహేష్ బాబు వంటి స్టార్ హీరో సినిమాకు డేట్లు ఇవ్వలేక పోయింది. మహేష్ బాబుతో ఈమె బ్రహ్మోత్సవం సినిమాలు చేయాల్సి ఉండగా డేట్లు లేకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకుందని టాక్. మహేష్ బాబుతో ఆ తర్వాత స్పైడర్ సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఇలా ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.
టాలీవుడ్‌లో దాదాపు ఐదేళ్ల పాటు బిజీ బిజీగా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్ మెల్ల మెల్లగా ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ఒకసారి నటించిన హీరోలు మరోసారి ఈమెతో నటించేందుకు ఆసక్తి చూపించక పోవడంతో టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గాయి. ఆ సమయంలో లక్కీగా బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసింది. అయితే అక్కడ కూడా ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేక పోయింది. రెండేళ్ల పాటు బాలీవుడ్‌లో సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ కూడా ఆఫర్లు లేకపోవడంతో ప్రస్తుతం అవకాశాల కోసం వెతుక్కుంటోంది. తాజాగా ఈమె ఫరాఖాన్ షో లో పాల్గొంది. ఆ సమయంలో జాకీ భగ్నానీతో ప్రేమ గురించి చెప్పుకొచ్చింది.
గత సంవత్సరం జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి జరిగింది. వీరిద్దరి మధ్య పరిచయం ఎప్పుడు ఏర్పడింది, వీరి ప్రేమ ఎప్పటి నుంచి సాగుతుంది అంటూ చాలా మందిలో ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నింటికి ఫరాఖాన్ కుకింగ్ వ్లాగ్ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... కోవిడ్ 19 లాక్డౌన్ సమయంలో మొదటి సారి జాకీని కలిసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ రోజు తన సోదరుడి పుట్టిన రోజు కావడంతో పార్టీ కోసం కజిన్స్ అంతా వోడ్కా బాటిల్ కోసం వెతికాం. ఆ సమయంలో అందరం కరోనా కారణంగా పీపీఈ కిట్లను ధరించి ఉన్నాం. అప్పుడే జాకీ ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
జాకీ ఇంట్లో ఉన్న వోడ్కా బాటిల్‌ను కూడా శానిటైజ్ చేసి తీసుకున్నామని రకుల్ నవ్వింది. అదే సమయంలో నా వద్ద ఉన్న వోడ్కా బాటిల్‌ను వాళ్లు తీసుకున్నారు. కానీ వారు నన్ను పార్టీకి పిలవలేదు అని నవ్వుతూ అన్నాడు. కొన్ని రోజుల తర్వాత రకుల్, ఆమె సోదరుడు మరోసారి జాకీ భగ్నానీ ఇంటికి వెళ్లారు. అప్పుడు జాకీ తన ఇంట్లో వండిన ఫుడ్‌ను సర్వ్ చేశాడట. అలా ఇద్దరి మధ్య వోడ్కా బాటిల్ కారణంగా పరిచయం అయిందని, ఆ తర్వాత పరిచయం స్నేహంగా మారిందని, ఆ స్నేహంను ప్రేమగా మార్చుకున్నట్లు రకుల్, జాకీ భగ్నాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల్లో ఆఫర్ల కోసం ఎదురు చూస్తూనే ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
