Begin typing your search above and press return to search.

రీమేక్‌ సీక్వెల్‌ షూటింగ్‌ షురూ

ఒక వేళ తెలుగు లో రాక్షసుడు 2 సినిమా హిట్ అయితే అప్పుడు రాచ్చసన్ సీక్వెల్‌ అంటూ రాచ్చసన్ 2 ను చేస్తారేమో చూడాలి.

By:  Tupaki Desk   |   14 Oct 2023 9:56 AM GMT
రీమేక్‌ సీక్వెల్‌ షూటింగ్‌ షురూ
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమాల్లో 'రాక్షసుడు' సినిమా టాక్ పరంగా, కమర్షియల్‌ గా హిట్ అనిపించుకుంది. తమిళ్ హిట్‌ మూవీ రాచ్చసన్‌ కి రీమేక్ గా రూపొందిన రాక్షసుడు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దర్శకుడు రమేష్ వర్మ ఆ సమయంలోనే సీక్వెల్‌ చేస్తానంటూ ప్రకటించాడు.


రమేష్ వర్మ అన్నట్లుగానే రాక్షసుడు సినిమా ను మొదలు పెట్టాడు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి అవ్వడంతో తాజాగా షూటింగ్‌ ను ప్రారంభించారు. షూటింగ్‌ ప్రారంభం అయిన విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు ఒక పోస్టర్‌ ను విడుదల చేసి మరీ ప్రకటించారు. షూటింగ్‌ ప్రారంభం అంటూ వచ్చిన పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రాచ్చసన్‌ మూవీ సీక్వెల్‌ పై మేకర్స్‌ ఆసక్తి చూపించలేదు. కానీ ఆ సినిమాకు రీమేక్ గా వచ్చిన రాక్షసుడు సినిమాకు మాత్రం సీక్వెల్‌ రాబోతుంది. ఒక వేళ తెలుగు లో రాక్షసుడు 2 సినిమా హిట్ అయితే అప్పుడు రాచ్చసన్ సీక్వెల్‌ అంటూ రాచ్చసన్ 2 ను చేస్తారేమో చూడాలి.

రమేష్ వర్మ దర్శకత్వం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా భూల్‌ భులాయా సినిమా రీమేక్‌ కు స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో ఏమో కానీ హఠాత్తుగా రాక్షసుడు 2 సినిమా షూటింగ్‌ ను మొదలు పెడుతున్నట్లుగా ప్రకటన వచ్చింది. బాలీవుడ్ నటుడు రాక్షసుడు 2 లో నటించబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.