Begin typing your search above and press return to search.

రాక్షస రాజు వచ్చేశాడు.. పవర్ఫుల్ లుక్

టాలీవుడ్ కథానాయకుడు రానా దగ్గుబాటి.. హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఫుల్ బిజీ గా గడుపుతున్నారు

By:  Tupaki Desk   |   14 Dec 2023 5:17 AM GMT
రాక్షస రాజు వచ్చేశాడు.. పవర్ఫుల్ లుక్
X

టాలీవుడ్ కథానాయకుడు రానా దగ్గుబాటి.. హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్ విషయంలో సెలెక్టివ్ గా దూసుకెళ్తున్నారు. ఇటీవలే రానా నాయుడు వెబ్ సిరీస్ తో సందడి చేసిన రానా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ చేస్తున్న సమయం రానే వచ్చింది.


గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్న రానా.. తన కొత్త సినిమాను ప్రకటించారు. తనకు నేనే రాజు నేనే మంత్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు తేజతో మరోసారి చేతులు కలుపుతున్నట్లు ప్రకటించారు. ఒక మాసివ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. సినిమా పేరు రాక్షస రాజాగా తెలిపారు.

దీంతో రానాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుందని సినీ వర్గాల్లో లో టాక్ వినిపిస్తోంది. కథ పెద్దదని అందుకే రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే రానా తో సినిమా తీయనున్నట్లు దర్శకుడు తేజా చాలా రోజుల క్రితమే ప్రకటించారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరకెక్కిన అహింస సినిమా ప్రీరిలిజ్ ఈవెంట్ లో తెలిపారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాకపోగా.. తాజాగా సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణ్ ను తేజ కలిసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆనందంగా వ్యక్తం చేయగా.. ఇప్పుడు సినిమాను అధికార ప్రకటన విడుదలైంది.

సినిమాల పరంగా రానా.. చివరగా విరాటపర్వం చిత్రంతో అలరించారు. ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మధ్యలో హిరణ్యకశ్యప ప్రకటించి త్రివిక్రమ్‌ కథ, మాటలు అందిస్తున్నట్టు వెల్లడించారు. కానీ ఈ విషయంపై అప్పుడు పెద్ద వివాదమే జరిగింది. డైరెక్టర్ గుణశేఖర్‌ ఈ ప్రాజెక్ట్ పై చాలా ఏళ్లుగా వర్క్ చేస్తుండగా.. త్రివిక్రమ్‌ ట్రాక్‌లోకి రావడం పెద్ద దుమారం రేపింది. దీంతో అంతా సైలెంట్ అయిపోయారు.

మరోవైపు, ఇప్పుడు తేజతో మూవీ కాకుండా రానా త్వరలో మరో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. పవన్ సాధినేనితో రానా ఓ సినిమా తీయనున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.