Begin typing your search above and press return to search.

అంబానీ నీ కొడుకును 5 రోజులు నా వ‌ద్ద‌కు పంపు!

అయితే ఇంత‌మందిని పిలిచి త‌న‌ని పిల‌వ‌క‌పోవ‌డంతో రాఖీ సావంత్ అలిగింది. అంతేకాదు త‌న ఆక్రోషాన్ని వెల్ల‌గ‌క్కిన తీరు ఇప్పుడు నెటిజ‌నుల్లో చ‌ర్చ‌గా మారింది.

By:  Tupaki Desk   |   6 March 2024 4:00 PM GMT
అంబానీ నీ కొడుకును 5 రోజులు నా వ‌ద్ద‌కు పంపు!
X

రిల‌యన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ ఏడాది జూలైలో పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. ఇటీవలే గుజరాత్‌ జామ్‌నగర్‌లో ప్రీవెడ్డింగ్ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. మూడు రోజుల ఈవెంట్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

రిహ‌న్నా, ఆకోన్ స‌హా ప‌లువురు పాప్ స్టార్లు అంబానీల పెళ్లిలో పెర్ఫామె చేసారు. భారీ మొత్తాల‌ను ఆర్జించారు. కేవ‌లం రిహాన్న కోసం అంబానీ 70 కోట్ల పారితోషికం చెల్లించార‌ని చెప్పుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక ఇదే వేడుక‌లో దిల్జీత్ దోసాంజ్ స‌హా ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు వేదిక‌పై అద్భుత ప్ర‌ద‌న్శ‌న‌లు ఇచ్చారు. హిందీ సినిమా తారా తోర‌ణం అక్క‌డ వేడుక‌ల్లో కొలువు దీరింది.

అయితే ఇంత‌మందిని పిలిచి త‌న‌ని పిల‌వ‌క‌పోవ‌డంతో రాఖీ సావంత్ అలిగింది. అంతేకాదు త‌న ఆక్రోషాన్ని వెల్ల‌గ‌క్కిన తీరు ఇప్పుడు నెటిజ‌నుల్లో చ‌ర్చ‌గా మారింది. "రాఖీ సావంత్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అంబానీ జీ నన్ను నియమించుకోండి. మీరు నన్ను ఉద్యోగంలో పెట్టుకోవాలి. మీ కొడుకు అనంత్ అంబానీని నా దగ్గరకు పంపండి" అని హిందీలో రాఖీ అడుగుతున్న వీడియో వైర‌ల్ గా మారింది. "మీ కొడుకుని ఐదు రోజులు నా దగ్గరకు పంపండి. అతను కర్రలా సన్నగా మార‌తాడు!" అని కూడా కామెంట్ చేసింది. అనంత్ బరువు గురించి రాఖీ ఇలా చెత్త‌గా కామెంట్ చేసింది.

అయితే రాఖీ సావంత్ వ్యాఖ్య‌ల‌ను నెటిజ‌నులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె మ‌తి చెడి ఇలా మాట్లాడుతోంద‌ని చాలా మంది దుయ్య‌బ‌ట్టారు. కొంద‌రు అసహ్యం వ్యక్తం చేస్తూ, "అసభ్యతకు కొంత పరిమితి ఉంటుంది" అనివ్యాఖ్యానించారు. "చెత్తను పోస్ట్ చేస్తున్నావు.. అత‌డికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. శరమ్ కరో యాప్ లాగ్" అని ఒక నెటిజ‌న్ రాసారు. "అందుకే ఆమెను పెళ్లికి ఆహ్వానించలేదు" అని ఓ వ్యాఖ్యలో రాసారు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఈ ఏడాది జూలైలో వివాహం చేసుకోనున్నారు. నిశ్చితార్థం, ప్రీవెడ్డింగ్ వేడుక‌లు ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, దీపికా పదుకొనే, కరీనా కపూర్ స‌హా చాలా మంది బాలీవుడ్ అతిథులు ప్రీవెడ్డింగ్ వేడుక‌లో త‌ళుక్కుమ‌న్నారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్, ఇవాంక ట్రంప్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరైన అంతర్జాతీయ ప్రముఖులలో ఉన్నారు.