Begin typing your search above and press return to search.

రాఖీ భాయ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే...!

కన్నడ రాక్‌ స్టార్‌ యశ్‌ కేజీఎఫ్‌ తర్వాత పాన్ ఇండియా స్టార్‌ అయ్యాడు. కేజీఎఫ్‌ 2 సినిమాతో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన యశ్‌ తదుపరి సినిమా విషయంలో సుదీర్ఘమైన చర్చలు జరిపిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   4 Jan 2024 12:30 PM GMT
రాఖీ భాయ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే...!
X

కన్నడ రాక్‌ స్టార్‌ యశ్‌ కేజీఎఫ్‌ తర్వాత పాన్ ఇండియా స్టార్‌ అయ్యాడు. కేజీఎఫ్‌ 2 సినిమాతో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన యశ్‌ తదుపరి సినిమా విషయంలో సుదీర్ఘమైన చర్చలు జరిపిన విషయం తెల్సిందే. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న యశ్‌ కొత్త సినిమాకు ఓకే చెప్పాడు.

గీతూ మోహన్‌ దర్శకత్వంలో ఒక భారీ పాన్‌ ఇండియా మూవీని చేసేందుకు యశ్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది. అతి త్వరలోనే రాఖీ భాయ్‌ కొత్త సినిమా సెట్స్ లో జాయిన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాక్సిక్‌ అనే టైటిల్‌ ను ఖరారు చేసిన ఈ సినిమాకు హీరోయిన్ గా బాలీవుడ్‌ స్టార్‌ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్‌ ని ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో రెండు నెలలో సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

బాలీవుడ్‌ తో పాటు సౌత్ లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న కరీనా కపూర్ ఖాన్ ను ఈ సినిమా లో నటింపజేయడం ద్వారా బాలీవుడ్‌ లో మంచి బజినెస్ ను దక్కించుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. షూటింగ్ ఇంకా ప్రారంభించకుండానే వచ్చే ఏడాది సమ్మర్‌ కి విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే.

గోవా బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా ఉంటుంది. ఎక్కువ శాతం ఈ సినిమా ను గోవాలో చిత్రీకరించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. కరీనా కపూర్‌ ఖాన్‌ హీరోయిన్‌ అనే విషయాన్ని షూటింగ్‌ ప్రారంభం సమయంలో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది